నవతెలంగాణ – శాయంపేట: గత శాసనసభ ఎన్నికలలో భూపాలపల్లి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గండ్ర సత్యనారాయణ రావు గెలుపొందడంతో మండలంలోని గంగిరేణి గూడెం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు వేముల రమేష్ అరుణాచలంలోని శివగిరిలో మొక్కులు చెల్లించుకున్నారు. అరుణాచల శివగిరి ప్రదక్షణ 15 కిలోమీటర్ల పాదయాత్ర చేసి, తలనీలాలను సమర్పించుకున్నారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆయురారోగ్యాలతో ఉండాలని, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించాలని, నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆ దేవుడిని వేడుకున్నట్లు రమేష్ తెలిపారు.