రెక్కలు విరుచుకున్న కష్టం
కన్నీటితోనే అంతం కాదు
ఏదో ఒకరోజు
అలలై ఎగసిపడుతుంది
మడుచుకున్న కాలు
అలానే ముడుచుకుని పోదు
ఎప్పుడో ఒకసారి
గెలుపు వైపు పరిగెడుతుంది
కట్టేసుకున్న మౌనం
అలానే కట్టై కాలిపోదు
ఎప్పటికైనా సరే
న్యాయాన్ని బద్ధలుకొడుతుంది
ఏదో ఒకరోజు
బడుగుల బరువు
తేలికైపోతూ కదులుతుంది
వెలుగు రేఖలా విచ్చుకుంటూ
విజయానికి
వారసత్వమౌతుంది
తొక్కబడిన ప్రతిదీ
పాతాళాన్ని ముద్దాడదు
ఎక్కడో ఒక చోట
విష్పోటనమై విజంభిస్తుంది
రాజకీయ బొమ్మవై
ఎల్లకాలం ఆడుతూ వుండిపోవు
ఏనాటికైనా
బ్రతుకు చిత్రానికి
మెరుగులద్దే మెరుపవుతుంది
అంచనాలన్నీ
మంచమెక్కి కూతెయ్యలేవు
ఏదో ఒక సమయంలో
జీవన రాగానికి పల్లవిగా
నిరంతరం ఆలపిస్తుంది
ఏదో ఒకరోజు
బడుగుల ఆశాజ్యోతులు
లోకాన్ని వెలిగిస్తాయి
చీకటిని తరిమికొడతాయి
– నరెద్దుల రాజారెడ్డి
9666016636