ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ మూడో రౌండ్‌కు అల్కరాజ్‌

ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ మూడో రౌండ్‌కు అల్కరాజ్‌పారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ పురుషుల సింగిల్స్‌ మూడోరౌండ్‌లోకి స్పెయిన్‌ సంచలనం కార్లోస్‌ అల్కరాజ్‌ ప్రవేశించాడు. బుధవారం జరిగిన రెండోరౌండ్‌ పోటీలో 3వ సీడ్‌ అల్కరాజ్‌ 6-3, 6-4, 2-6, 6-2తో డీ-జంగ్‌(ఫ్రాన్స్‌)ను ఓడించాడు. మరో పోటీలో 9వ సీడ్‌ సిట్సిపాస్‌(గ్రీక్‌) 6-3, 6-2, 6-7(2-7), 6-4తో అల్టిమేయర్‌(జర్మనీ)పై చెమటోడ్చి నెగ్గాడు. ఇక మహిళల సింగిల్స్‌లో 8వ సీడ్‌ అన్స్‌ జబీర్‌ మూడోరౌండ్‌లోకి ప్రవేశించారు. జబీర్‌ 6-3, 1-6, 6-3తో సెర్రెన్నో(కొలంబియా)ను ఓడించింది. మరో పోటీలో 21వ సీడ్‌ ఫ్రాన్స్‌కు చెందిన గార్సియా అనూహ్యంగా రెండోరౌండ్‌లోనే ఇంటిదారి పట్టింది. గార్సియాపై అమెరికాకు చెందిన కెనిన్‌ 6-3, 6-3తో వరుససెట్లలో విజయం సాధించింది. మరో పోటీలో 26వ సీడ్‌ బుల్టర్‌(ఇంగ్లండ) 6-4, 5-7, 4-7తో బడోసా(స్పెయిన్‌) చేతిలో అనూహ్యంగా ఓటమిపాలైంది.