– నెలన్నర కనిష్టానికి రూపాయి
– సెషన్లో 0.2 శాతం తగ్గి డాలర్‌కు రూ.83.34
ముంబయి: దిగుమతిదారుల నుంచి డాలర్‌కు డిమాండ్ పెరగడంతో పాటుగా ఎన్నికల సంబంధిత భయాలతో రూపాయి విలువ నెలన్నర కనిష్టానికి పడిపోయింది. బుధవారం సెషన్లో 0.2 శాతం తగ్గి 83.34 వద్ద ముగిసింది. ఇంతక్రితం సెషన్లో ఇది 83.17 వద్ద ముగిసింది. ఏప్రిల్ 12 తర్వాత ఇదే కనిష్టం. నెలాఖరు కావడంతో చమురు దిగుమతిదారులు డాలర్ల కొనుగోళ్లను పెంచడంతో రూపాయి విలువ తగ్గిందని వెల్స్ట్రీట్ ఫౌండర్ సుగంధ సచ్‌దేవా పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల ఫలితాలకు ముందు రూపాయి విలువలో భారీ అనిశ్చితి నెలకొనే అవకాశాలు ఉన్నాయన్నారు. డాలర్‌తో రూపాయి విలువ 84.20కు తగ్గొచ్చన్నారు.