
నవతెలంగాణ – చండూరు
చండూరు కి వచ్చిన పచ్చిరొట్టె ఎరువుల విత్తనాలను మునుగోడు వ్యవసాయ సహాయ సంచాలకులు డి. ఎల్లయ్య, మండల వ్యవసాయ అధికారి రేవతి ఆధ్వర్యంలో ఆగ్రో రైతు సేవా కేంద్రం వద్ధ రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా డి. ఎల్లయ్య మాట్లాడుతూ.. ఈ వానాకాలం సీజన్ కి మునుగోడు వ్యవసాయ డివిజన్ పరిధిలో పచ్చిరొట్టె ఎరువులు అయిన జీలుగ మొదటి దఫాలో మునుగోడు మండలానికి 30 క్వింటాలు , చండూర్ కి 40 క్వింటా లు నాంపల్లి కి 18 క్వింటాలు , రెండవ దఫాలో జీలుగ మునుగోడు మండలానికి 19.80 క్వింటా లు వచ్చాయని తెలిపారు. జనుము మునుగోడు కి 20 క్వింటా లు చండూర్ కి 10క్వింటా లు వచ్చాయి అన్నారు.కావలసిన రైతులు భూమి పాసుపుస్తకం, ఆధార్ కార్డు సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారికి ఇచ్చి సబ్సిడీ విత్తనాలు పొందాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎ. ఓ టెక్నికల్ మల్లేష్, ఎ.ఈ ఓ నాగార్జున రైతులు పాల్గొన్నారు.