
నవతెలంగాణ – మల్హర్ రావు
తెలంగాణ రాష్ట్ర ఐటి,పరిశ్రమల,శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి, దుద్దిళ్ల శ్రీదర్ బాబు 55వ పుట్టినరోజు వేడుకలు మండలంలోని అన్ని గ్రామాల్లో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బడితేల రాజయ్య, అన్ని గ్రామాల కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖల అధ్యక్షుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధిహామీ కూలీలకు మజ్జిగ ప్యాకేట్స్, ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రములో పేదలకు పండ్లు,పాలు,స్వీట్లు పంచారు.అనంతరం పెద్దమ్మతల్లి దేవాలయంలో శ్రీదర్ బాబు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి చింతలపల్లి మల్హర్ రావు, భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సి సెల్ అధ్యక్షుడు దండు రమేష్,సింగిల్ విండో వైస్ చైర్మన్ మల్కా ప్రకాష్ రావు, డైరెక్టర్లు ఇప్ప మొoడయ్య,వొన్న తిరుపతి రావు, సంగ్గెం రమేష్, జిల్లా మత్స్యశాఖ డైరెక్టర్ జంగిడి శ్రీనివాస్,మాజీ జెడ్పిటిసి కొండ రాజమ్మ,మమత, నాయకులు రాజిరెడ్డి, గడ్డం క్రాoతి, రాహుల్, సవేంధర్,సతీష్,సది, అశోక్, జంగిడి సమ్మయ్య, కేశారపు చెంద్రయ్య, ప్రభాకర్,అశోక్ రావు,బొబ్బిలి రాజు గౌడ్,రాజ సమ్మయ్య,,చంద్రగిరి అశోక్,అంజయ్య, గట్టయ్య,లింగన్నపేట రమేష్,లింగయ్య పాల్గొన్నారు.