– తీసుకునేందుకు స్క్వాడ్ బృందాలు ఏర్పాటు…
– యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతు కె జండాగే…
నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్ : రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందేలా కృత్రిమ కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకొనేందుకు సీడ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ హనుమంత్ కే జండగే తెలిపారు. గురువారం నాడు ఆయన వ్యవసాయ, పోలీస్ అధికారులతో సమావేశమైనారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వానకాలం 2024 సీజన్ పురస్కరించుకొని రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందేలా విత్తన చట్టాన్ని పకడ్బందిగా అమలు చేసేందుకు వ్యవసాయ, పోలీస్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో 4 విత్తన స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నాణ్యమైన విత్తన సరఫరా కోసం స్క్వాడ్ బృందాలు డీలర్ షాపులలో తనిఖీలు నిర్వహించడం, స్టాక్ రసీదులు పరిశీలించడం జరుగుతుందని, అక్రమ చర్యలకు పాల్పడితే విత్తన చట్టం 1966 ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే పి.డి. యాక్ట్ ప్రయోగించాలని తెలిపారు. విత్తన, ఎరువుల గోదాములను, డీలర్ షాపులను తనిఖీ చేయాలి, సీడ్ లైసెన్స్ పరిశీలించాలి, నేమ్ బోర్డ్, స్టాక్ బోర్డ్, ధర జాబితా, బిల్లులు, డెలివరీ చలాన్‌లు, ఇన్‌వాయిస్‌లను పరిశీలించాలని, బుక్ బ్యాలెన్స్‌తో స్టాక్ పరిశీలించాలన్నారు. తనిఖీ సమయంలో గడువు ముగిసిన విత్తన స్టాక్ ఏమైనా ఉందా అని పరిశీలించాలని, ఎం ఆర్ పి కంటే ఎక్కువ విక్రయించడం వంటి చట్ట విరుద్ధ కార్యకలాపాలను నియంత్రించాలని, అలాగే రైతుల నుండి ఏదైనా ఫిర్యాదులు అందితే వెంటనే చర్యలు తీసుకోవాలని తెలిపారు. వ్యవసాయ అధికారులు, విస్తరణ అధికారులు క్షేత్రస్థాయిలో రైతులకు నకిలీ విత్తనాల పట్ల కలిగే నష్టాలపై, మేలు రకం విత్తనాల ద్వారా వచ్చే లాభాలను వివరించాలని సూచించారు. విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, రైతులు బ్రాండెడ్ విత్తనాలను కొనాలని, తప్పనిసరిగా బిల్లులు తీసుకొని దగ్గర ఉంచుకోవాలని ఈ సందర్భంగా తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు రెవిన్యూ కలెక్టర్ పి బెన్ షాలోమ్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అనురాధ, వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్లు దేవీసింగ్, పద్మావతి, వెంకటేశ్వర్లు, నీలిమ, వ్యవసాయ, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.