తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
జూన్ 2 వ తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా ఏర్పాట్లను పకడ్బందిగా  నిర్వహించాలని  జిల్లా కలెక్టర్ హనుమంత్ కే జండగే అధికారులకు సూచించారు. గురువారం నాడు కాన్ఫరెన్స్ హాలులో ఆయన అన్ని శాఖల అధికారులతో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఏర్పాట్లను సమీక్ష నిర్వహించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ 2 వ తేదీన ఉదయం 9.00 గంటలకు సమీకృత  జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాతీయ పతకవిష్కరణ జరుగుతుందని, అంతకు ముందు భువనగిరి పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు నివాళులు అర్పించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమాలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.