బడిబాటను విజయవంతం చేయాలి

– బడీడు పిల్లలు బడిలో చేరేలా కృషి చేయాలి
– మండల ప్రత్యేక అధికారి సత్తార్‌
నవతెలంగాణ-తాండూరు రూరల్‌
వచ్చేనెల 3 నుంచి 19 వరకు కొనసాగే బడిబాట కార్యక్రమాన్ని విజయ వంతం చేసి బడీడు పిల్లలు బడిలో చేరేలా కృషి చేయాలని మండల ప్రత్యేక అధికారి సత్తార్‌ అన్నారు. గురువారం తాండూర్‌ మండల పరిషత్‌ కార్యాలయ అవరణలో ఎంపీడీవో విశ్వప్రసాద్‌ ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయులు, పంచాయతీ కార్యదర్శులు, ఐకేపీ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ఉపాధ్యాయులతో పాటు మహిళా సంఘాలు, సీసీలు, పంచాయతీ కార్యదర్శులు, వాలంటరీస్‌, అందరూ సమన్వయంతో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించి విజయవంతం అయ్యేలా కృషి చేయాలన్నారు. ప్రతి గ్రామంలో పూర్వ విద్యార్థులు గ్రామ పెద్దలు, ప్రయివేటు పాఠశాలల్లో చదువుతున్న పిల్లలు, బడి బయట ఉన్న పిల్లలందరూ కలిసి గ్రామంలో ఉన్న పాఠశాలలో చదవాలని, సూచించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలో కల్పిస్తున్న సౌకర్యాలు అన్ని విద్యార్థులకు తల్లిదండ్రులకు వివరించి వారి పిల్లలను గ్రామంలో చదివించేందుకు ప్రయత్నం చేయాలన్నారు. ప్రభుత్వం పుస్తకాలు నోట్‌ బుక్‌ లతో పాటు యునిఫాం పంపిణీ చేస్తూ విద్యార్థులకు భోజన వసతి కల్పిస్తుందన్నారు. దీని దష్టిలో పెట్టుకొని 15 రోజులపాటు వాడవాడను తిరిగి అవగాహన కల్పించి విద్యార్థుల హాజరు శాతం ప్రవేటు పాఠశాలల కన్నా ప్రభుత్వ పాఠశాలలో మెరుగుపడేలా కషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఏవో రజిత, ఏపీఎం ఆనంద్‌, ఆర్డబ్ల్యూఎస్‌, పంచాయత్‌ రాజ్‌, ఏఈలు, పంచాయతీ కార్యదర్శులు ప్రధానోపాధ్యాయులు ఉన్నారు.