నవతెలంగాణ-పరిగి
బడీడు పిల్లలను బడిలో చేర్పించాలని మండల విద్యాధికారి హరిచందర్ అన్నారు. గురువారం పరిగి మండల అభివద్ధి కార్యాల యంలో ప్రాథమిక, ప్రాథమిక ఉన్నత, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, వివిధ గ్రామాల స్పెషలాఫీసర్లకు, గ్రామాల పంచాయతీ సెక్రటరీలకు, అంగన్వాడీ సూపర్వైజర్లకు, ఐకెపీ సిబ్బందికి మండల అభివద్ధి అధికారి, మండల విద్యాధికారి ఆధ్వర్యంలో బడిబాట అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి హరిచందర్, మండల అభివద్ధి అధికారి ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ జూన్ 3 నుంచి 19వ తేదీ వరకు బడిబాట కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రతిరోజు అధికారులు గ్రామాలలో తిరుగుతూ ఐదు సంవత్సరాల పిల్లలను బడిలో చేర్పించే విధంగా కషి చేయాలని అన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలల పనులు పాఠశాలలలో జూన్ 3లోపు పూర్తి అయ్యే విధంగా కృషి చేయాలన్నారు. వేసవి సెలవుల్లో ప్రధానోపాధ్యాయులు విధులు నిర్వహించినందుకు ఈయల్స్ ఇవ్వాల్సిందిగా వివిధ సంఘాల నాయకులు మండల విద్యాధికారి దష్టికి తీసుకువచ్చారు. కార్యక్రమంలో మండల అధికారులు, మండల ఎంఆర్సి సిబ్బంది, సిఆర్పిలు తదితరులు పాల్గొన్నారు.