– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఏ.వెంకటస్వామి
నవ తెలంగాణ – జోగులాంబ గద్వాల
సమాజంలో ఆర్థిక, సామాజిక దోపిడీని సమూలంగా నిర్మూలించి అసమానతలులేని సమసమాజ స్థాపనే సీపీఐ(ఎం) ధ్యేయమని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఏ.వెంకటస్వామి అన్నారు. జిల్లాస్థాయి రాజకీయ శిక్షణ తరగతులు స్థానిక సీపీఐ(ఎం) కార్యాలయంలో ప్రారంభ మయ్యాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పెట్టుబడి దారి సమాజం, ఆర్థిక సామాజిక దోపిడీ రెండు కళ్లుగా చేసుకొని సమాజాన్ని నిరంతరం దోపిడీకు గురిచేస్తుందని అన్నారు. పెట్టుబడిదారులు , భూస్వాములు కార్మికులను పేదప్రజలను దోపిడీకి గురిచేసి వారి చెమటను ధారపోసి సష్టించిన సంపదను దోచుకు తింటున్నారని అన్నారు. పెట్టుబడుదారి విధానం గుత్తా పెట్టుబడిదారీ విధానంగా మారి సమాజ నిర్మాణాన్ని ధ్వంసం చేసి గ్రామీ ణ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసి భూస్వామ్యవ్యవస్థ బలో పేతానికి కషి చేస్తున్నదని అన్నారు. సమాజంలో బ్రాహ్మణ వాదాన్ని పెంపొందించి కులవ్యవస్థను ఇంకా సజీవంగా ఉంచాలని, దీని ద్వారా సమాజాన్ని విభజించి తమ రాజకీయ పబ్బం గడుపుక్కోవాలని చూస్తున్నారని అన్నారు. ఆర్థిక సామాజిక దోపిడీిని నిర్మూలించని ఏ సమాజము ప్రగతి బాటన పట్టలేదని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగడుతూ పీడిత ప్రజలను దోపిడీ చేస్తున్న పెట్టుబడిదారుల కుట్రలను బయటపెడుతూ అణచివే యపడుతున్న పీడిత సమాజానికి అండగా ఉండాలంటే సీపీఐ(ఎం) పార్టీ కార్యకర్తలుగా సమగ్ర రాజకీయ అవగాహన కలిగి ఉండాలన్నారు. రాజకీయ చైతన్యంతో ఆర్థిక , సామాజిక దోపిడీ నిర్మూలనలో జరిగే పోరాటాలలో ప్రజలను భాగస్వాములను చేయడంలో కీలకపాత్ర పోషిం చాలన్నారు. కులం, మతం, ప్రాంతం, లింగం, జాతుల పేరుతో ప్రజల మధ్య విద్వేషాలు సష్టించి ప్రజలను కార్మికు లను ఐక్యం కాకుండా చేస్తున్న బూర్జువ రాజకీయాలను ప్రజలు విడమర్చి వారిని సంఘటితం చేయాలని అన్నారు. సమాజంలో పేరుకపోయిన ఈ జాడ్యాలను పోరాటల ద్వారా మాత్రమే నిర్మూలించగలమని అన్నారు. కొన్ని సామాజిక వర్గాలకు చట్టబద్ధ రాజ్యాంగ పదవులు అందిం చిన అంత మాత్రాన కుల వ్యవస్థ రూపు మాయబడదని ప్రతిఘటన పోరాటాల ద్వారానే కుల వ్యవస్థాపన జరుగుతుందని అన్నారు. ప్రభుత్వాలు అందించే వివిధ సంక్షేమ పథకాలు ఆర్థిక అసమానతలను రూపుమా పలేవని, సంఘటిత ఐక్య పోరాటాల ద్వారానే ఆర్థిక సమానతలు లేని సమాజాన్ని స్థాపించగలమని అన్నారు. మొదటిరోజు జీ. రాజు అధ్యక్షతన జరిగిన రాజ కీయ శిక్షణ తరగతుల్లో భాగంగా ఏ వెంకటస్వామి కులం మతం పార్టీ నిర్మాణం అనే అంశాలను బోధించారు. ఈ శిక్షణా తరగతులకు సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు రేపల్లె దేవదాసు, వీ వీ నరసింహ , మద్దిలేటి, పరంజ్యోతి, ఉప్పేర్ నరసింహ, నర్మద , ఈదన్న , వివిధ మండలాల కార్యద ర్శులు బీ. నరసింహ , ఆంజనేయులు, విజరు కుమార్, గంగన్న,అన్ని మండలాల కార్యకర్తలు పాల్గొన్నారు.