రైతులు విత్తనాల కొనుగోలులో జాగ్రత్తలు తీసుకోవాలి..

– దళారులను నమ్మి  మోసపోవద్దు
– ఏడిఏ ఎన్. శ్రీధర్, ఎంఏఓ పోరిక జైసింగ్
– రైతులకు అవగాహన కార్యక్రమం
నవతెలంగాణ – తాడ్వాయి
రైతులు విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సహాయ వ్యవసాయ సంచాలకులు ఏటూర్ నాగారం(ఏ డి ఏ) ఎన్ శ్రీధర్, మండల వ్యవసాయ శాఖ అధికారి పోరిక  జైసింగ్ లు అన్నారు. శుక్రవారం మండలంలోని కామారం గ్రామపంచాయతీ ఆవరణలో  రైతులకు విత్తన కొనుగోలులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లూజుగా ఉన్న సంచు ల్లో విత్తనాలు కొనుగోలు చేయరాదని, విత్తనాలు కొనుగోలు చేసిన దుకాణం నుంచి రసీదు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. విత్తన ప్యాకెట్లు, బిల్లులు పంటకాలం పూర్తి అయ్యేవరకు భద్రంగా ఉంచుకోవాలన్నారు. వ్యవసాయ శాఖ పర్మిషన్ పొందిన డీలర్ల వద్దనే విత్తనాలు కొనాలని సూచించారు. ప్యాక్ చేసి లేబుల్ ఉన్న విత్తనాలు మాత్రమే కొనుగోలు చేయాలన్నారు. ఎవరైనా లూజు విత్తనాలమ్మితే వ్యవసాయ శాఖ కు కానీ, పోలీసులకు కానీ సమాచారం అందించాలన్నారు. నకిలీ విత్తనాలపై రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రైతులందరూ రాబోయే 2024 వానాకాలంలో రాష్ట్ర ప్రభుత్వం అమలుపరిచే ఫజల్ బీమా యోజన పథకం కింద రైతు సోదరులు తాము పండించే పంటలకు తప్పనిసరిగా క్రాప్ ఇన్సూరెన్స్ చేయించుకోవాలన్నారు. పత్తి పంటలో బీటీ విత్తనాలు అన్నీ కూడా ఒకే రకంగా ఉంటాయని, బీటి 3 మన రాష్ట్రం ఇంకా అనుమతి రాలేదు, కనుక రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు అని తెలిపారు. వేసుకొని భూమిని సారవంతపరుచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఏవో జై సింగ్, ఏ ఈ ఓ లు జిజే రవికుమార్, రైతులు తదితరులు పాల్గొన్నారు.