గ్రామంలో శునకాల హల్చల్.. పదిమంది కుక్క కాటుకు బలి..

నవతెలంగాణ – రెంజల్ 

రెంజల్ మండలం కందకుర్తి గ్రామంలో గురు, శుక్రవారం రెండు రోజులలో పదిమంది కుక్క కాటుకు బలయ్యారని గ్రామస్ తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గురువారం నలుగురు, శుక్రవారం ఆరుగురికి కుక్కకాటుకు బలి కావడం తో వారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స చేసుకున్నారు. మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న కందకుర్తి గ్రామానికి శునకాలు ఎక్కడ నుండి వచ్చాయో తమకు అర్థం కావడం లేదనీ, ప్రధాన రోడ్డుపై కనబడ్డ వారందరికీ ఒక కలవడం జరుగుతుందని వారు పేర్కొన్నారు. గ్రామంలోకి వచ్చి ప్రజలకు భయభ్రాంతులను కలిగిస్తున్న శునకాలను తొలగించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. గ్రామంలో అత్యవసర పనుల కోసం బయటకు వెళ్లాలంటే ప్రజలు భయపడుతున్నారని వారన్నారు. గ్రామపంచాయతీ సిబ్బంది కానీ, సంబంధిత శాఖ వెంటనే స్పందించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న శునకాలను తొలగింపజేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.