పోషణ అభియాన్ యాప్ లో చిన్నారుల బరువును ఎన్రోల్మెంట్ చేయాలి

– అంగన్వాడి టీచర్లకు సమీక్ష సమావేశం: సీడీపీఓ జానకి..

నవతెలంగాణ – రెంజల్ 
పోషణ అభియాన్ యాప్ లో చిన్నారుల బరువులను ఎన్రోల్మెంట్ చేయాలని సీడీపీఓ జానకి, పోషణ అభియాన్ జిల్లా కోఆర్డినేటర్ రాంబాబులు స్పష్టం చేశారు. శుక్రవారం బ్రింజాల్ మండల కేంద్రంలోని నాలుగవ అంగన్వాడి కేంద్రంలో మండలంలోని అంగన్వాడీ కార్యకర్తలకు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రతి ఇంట్లో నున్న చిన్నారుల పరులను 100% పూర్తి చేయాలని వారు ఆదేశించారు. ఈ సర్వేలో నిర్లక్ష్యం చేసే అంగన్వాడీలపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని వారు హెచ్చరించారు. అంగన్వాడి కేంద్రాలలో రెండున్నర సంవత్సరాల పిల్లలను గుర్తించి అంగన్వాడీ కేంద్రంలో చేర్పించాలని, ఐదు సంవత్సరాలు పోతే నా పిల్లలందరినీ ప్రైమరీ పాఠశాలలో చేర్పించాలని వారికి సూచించారు. ప్రతిరోజు చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందిస్తూ, అంగన్వాడి కేంద్రం యొక్క పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో పోషణ అభియాన్ జిల్లా కోఆర్డినేటర్ రాంబాబు, ఐ సి డి ఎస్ సూపర్వైజర్ ప్రమీల రాణి, మండల పరిధిలో ని అంగన్వాడి టీచర్లు ఆయాలు పాల్గొన్నారు.