అందుబాటులో నాణ్యమైన పత్తి వరి విత్తనాలు

– కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌
– మన గ్రోమోర్‌, అగ్రి రైతు సేవ, జై కిసాన్‌ కేంద్రాల్లో కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ
నవతెలంగాణ – వనపర్తి / ఆత్మకూరు
వర్షాకాలం సాగుకు అవసరమైన నాణ్యమైన పత్తి, వరి విత్తనాలు డీలర్ల దగ్గర అందుబాటులో ఉన్నాయని, రైతులు ఆందోళన చెందనవసరం లేదని కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌ తెలిపారు. శుక్రవారం జిల్లా పరిధిలోని కొత్తకోట మండల కేంద్రంలోని మన గ్రోమోర్‌, ఆత్మకూరు మండల కేంద్రంలోని అగ్రి రైతు సేవ కేంద్రం, జై కిసాన్‌ దుకాణాలను కలెక్టర్‌ ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. ఈ సంద ర్బంగా కలెక్టర్‌ దుకాణాల్లో విత్తనాలు, ఎరువుల నిల్వలు, అమ్ముడైన వాటి రికార్డులను పరిశీలించారు. ఎక్కువగా ఏ బ్రాండ్‌ విత్తనాలకు డిమాండ్‌ ఉందని అడిగి తెలుసుకున్నా రు. జిల్లాలో వర్షాకాలం పత్తి సాగుకు సరిపడా నాణ్యమైన పత్తి, వరి విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. జిల్లాకు 14,350 పత్తి విత్తనాల పాకెట్స్‌ రాగా, అందులో ఇప్పటి వరకు కేవలం 2,512 అమ్ముడయ్యాయని తెలిపారు. విత్త నాలకు సంబంధించి ఎక్కడైనా కొరత ఉంటే కలెక్టరేట్‌ కంట్రోల్‌ రూమ్‌ హెల్ప్‌ లైన్‌ నెంబర్‌ 08545 233525 కి కాల్‌ చేయమని సూచించారు. కంట్రోల్‌ రూమ్‌లో స్టాక్‌ పోసిషన్‌ వివరాలు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా చూడాలని జిల్లా అధికారులకు సూచించారు. విత్తనాల విషయంలో రైతులను మోసం చేసే ఘటనలు చోటుచేసు కోకుండా మండలాల వారీగా తనిఖీ వ్యవసాయ, రెవెన్యూ, పోలీస్‌ అధికారులతో బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆయా బృందాలు ఎప్పటికప్పుడు తనిఖీ లు చేసి నాసిరకం విత్తనాలు అమ్మే వారిని గుర్తించి చర్యలు తీసు కోవడం జరుగుతుంది అని తెలిపారు. ఎవరైనా నాసిరకం విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుం దని తెలిపారు. లేబుల్‌, పాకింగ్‌ లేని విత్తనాలు అమ్మకూడ దన్నారు. ఇకపోతే ఫర్టిలైజర్స్‌కు సంబందించి కూడా సరిప డా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇట్టి కార్యక్రమం లో జిల్లా వ్యవసాయ అధికారి డి.చంద్రశేఖర్‌, ఏడీఏ దామో దర్‌, వ్యవసాయ విస్తరణ అధికారికి మహేశ్వరి, మండల తహసిల్దార్‌ రాజు, మండల విద్యాధికారి భాస్కర్‌ సింగ్‌, తదితరులు పాల్గొన్నారు.