– టీడీఎఫ్ అధ్యక్షురాలు వాణి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వనితా చేయూత ప్రాజెక్టులో గురువారం రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం మోకిల గ్రామంలో మహిళా శక్తి సంఘా లకు తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరమ్(టీడీఎఫ్) ఆధ్వర్యంలో కుట్టు మిషన్లను పంపిణీ చేసినట్టు టీడీఎఫ్ అధ్యక్షురాలు వాణి తెలిపారు. పాఠశాల విద్యార్థుల యూనిఫామ్ లు కుట్టే బాధ్యత సంఘాలకు ఇవ్వటంతో, వాటి విజ్ఞప్తి మేరకు వారికి కుట్టు మిషన్లు పంపిణీ చేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా టీడీఎఫ్ జాతీయ అధ్యక్షులు మట్టా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారత కోసం ఎంతో కృషి చేస్తున్నదని తెలిపారు. మహిళా సంఘాలు వారికి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యా యుడితో పాటు వీఓఏ సుజాత, అమ్మ ఆదర్శ కమిటీ సభ్యులు పద్మ,కో ఆర్డినేటర్ సుధాకర్, భీమయ్య, అనంతయ్య, అశోక్, మహిళా సంఘం సభ్యులు పాల్గొన్నారు.