– న్యూయార్క్ టైమ్స్
ఉక్రేనియన్ దళాలు ఈ వారం రష్యాలోని బెల్గోరోడ్ ప్రాంతంలోని లక్ష్యాలపై అమెరికా అందించిన ఆయుధా లను ఉపయోగించే అవకాశముంది. వాటిని ఎక్కడ ఉపయోగించవచ్చనే దానిపై పరిమితులను అమెరికా సడలించినట్టు పాశ్చాత్య పత్రికలు రిపోర్ట్ చేస్తున్నాయి. అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ గతంలో ”మూడవ ప్రపంచ యుద్ధం” నుంచి తప్పించుకోవడానికి ఉక్రెయిన్‌కు పంపిన అమెరికన్ ఆయుధాలను రష్యా భూభాగంగా భావించే వాటిని లక్ష్యంగా చేసుకోలేవని పేర్కొన్నాడు. రష్యా లోని బెల్గోరోడ్ ప్రాంతానికి సరిహద్దుగా ఉన్న, ఈ నెలలో తీవ్రమైన పోరాటాన్ని చూసే ఖార్కోవ్ ప్రాంతానికి ప్రత్యక్ష ముప్పు కలిగించే ప్రత్యేక సైనిక లక్ష్యాలపై దాడి చేయడానికి అమెరికా ఉక్రెయిన్‌ను అనుమతిస్తుంది. రష్యన్ దళాలు ఈ ప్రాంతంలో గణనీయంగా పురోగమించాయి.
అణ్వాయుధ దేశంపై దాడులకు అధికారం ఇచ్చిన మొదటి అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ కనిపిస్తారని వార్తాపత్రిక గురువారం పేర్కొంది. ”ఇది ఒక కొత్త వాస్తవికత” అని ఒక సీనియర్ అమెరికా అధికారి న్యూయార్క్ టైమ్స్‌తో అన్నాడు. ఉక్రెయిన్ వివాదంలో బహుశా ఇది ఒక నూతన శకం. మే 15న జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్ ఈ విషయంపై అధికారిక సిఫార్సులను అందించినప్పుడు అమెరికా అధ్యక్షుడు మొదట మార్పు చేయడానికి మొగ్గు చూపాడని, గత వారం చివరిలో బైడెన్ జాతీయ భద్రతా ‘ప్రిన్సిపల్స్’ని కలిసి ఈ చర్య నష్టాలను చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకోబడిందని అధికార వర్గాలను ఉటంకిస్తూ న్యూయార్క్ టైమ్స్ రాసింది.
ఈ విషయం గురించి రోజుల తరబడి కిందిస్థాయి అధికారులకు ఎటువంటి సమాచారం అందించలేదు. మంగళవారం మీడియా సమావేశంలో పెంటగాన్ అధికార ప్రతినిధి సబ్రీనా సింగ్ పాత విధానాన్ని సమర్థించింది. అప్పటికే డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టింగ్ సంబంధిత ఉత్తర్వులను జారీ చేశాడు. అయితే ఈ విషయాన్ని ”ఎవరూ ఆమెకు చెప్పలేదు” అని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది.
మాస్కో దాని ప్రావిన్షియల్ రాజధానితో సహా బెల్గోరోడ్ ప్రాంతంపై నిరంతర ఉక్రేనియన్ షెల్లింగ్, డ్రోన్ దాడులకు ప్రతిస్పందనగా ఖార్కోవ్ ప్రాంతంలో దాడిని ప్రారంభించిందని చెప్పారు. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పరిస్థితిని వివరించడంలో పశ్చిమ దేశాలు ఆ భాగాన్ని విస్మరిస్తున్నాయని చెప్పాడు. రష్యాలో లోతుగా పాశ్చాత్య ఆయుధాలతో దాడులను చేస్తే సంఘర్షణ మరింతగా పెరుగుతుంది. ఈ స్థిరమైన పెరుగుదల తీవ్రమైన పరిణామాలకు దారితీయవచ్చు. ఐరోపాలో ఆ పరిణామాలు జరిగితే, వ్యూహాత్మక ఆయుధాలలో రష్యా సమానత్వాన్ని పరిగణనలోకి తీసుకుని అమెరికా ఎలా వ్యవహరిస్తుంది? అని పుతిన్ ప్రశ్నించాడు.