పేదింటి బిడ్డకు పెద్ద కష్టం..

– లివర్ సమస్యతో ఆసుపత్రిలో చేరిన బాలుడు
– అపన్నహస్తం కోసం ఎదురుచూపులు
నవతెలంగాణ – మల్హర్ రావు
పేదింటి బిడ్డకు పెద్ద కష్టం వచ్చింది.రోజు అమ్మ ఒడిలో ఆలనాపాలన చేసే పసి బాలుడుకి ఉహించని లివర్ సమస్య  వచ్చింది. వైద్యం చేయాలంటే రూ.35 లక్షల ఖర్చువుతుందని వైద్యులు సూచించడంతో బాలుని  తల్లిదండ్రుల వద్ద చిల్లి గవ్వ లేకపోవడంతో ఆపన్నహస్తం ఎదురుచూస్తున్నారు.పూర్తి వివరాల ప్రకారం మండలంలోని రుద్రారం గ్రామానికి చెందిన బుట్టి శ్యామల-రాజ్ కుమార్ యాదవ్  దంపతులు నిరుపేద కుటుంబానికి చెందినవారు.నిత్యం మేకల కాపరిగా, కూలి పనులు చేసుకొని జీవిస్తున్న వీరి జీవితంలో ఊహించని కష్టం వచ్చింది.ఈ  దంపతులకు ఒకగాను ఒక 7 నెలల  కుమారుడు హర్షిత్ కుమార్ కు మూడు నెలల క్రితం తీవ్రమైన కడుపునొప్పి రావడంతో తల్లిదండ్రులు మంచిర్యాల లోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చేర్పించారు.మూడు రోజుల చికిత్స అనంతరం వైద్యులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లోని కిమ్స్ చిల్డ్రన్ ఆసుపత్రికి తరలించారు.పరీక్షించిన వైద్యులు హర్షిత్ కు లివర్ పూర్తిగా చెడిపోయిందని,మార్పిడి చేయాలని, అందుకు రూ.35 లక్షలు ఖర్చువుతుందని వైద్యులు సూచించినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు.కూలి పనులు చేసుకుంటున్న రాజ్ కుమార్ పరిస్థితి అంతంత మాత్రమే కావడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.ఇప్పటికే రేండు మూడు ఆసుపత్రులకు తిరిగి రూ.5 లక్షల వరకు ఇల్లు గుళ్ళా చేసుకున్నట్లుగా కన్నీరుమున్నీరావుతున్నారు.ఈ క్రమంలో వైద్య చికిత్సకు డబ్బులు లేక, మరోపక్క బాలుని పరిస్థితి చూడలేక ఆ నిరుపేద దంపతులు ఆందోళన చెందుతున్నారు.ఆపన్న హస్తం కోసం దయనియులైనా దాతలు ముందుకు వచ్చి ఫోన్ 6304441688 మరియు 6305779113 లకు ఫోన్ పే, గూగుల్ పే  సహాయం చేసి, ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.