– గ్రామస్తులు ఆందోళన, స్మశాన వాటికకు దారి పరిష్కారం
నవతెలంగాణ – మద్నూర్
గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీ రామారావు హాయంలో మద్నూర్ మండల కేంద్రంలో బస్టాండ్ నిర్మాణం చేపట్టడం జరిగింది. ఆ బస్టాండు ప్రస్తుతం ప్రయాణికులకు ఎలాంటి సౌకర్యంగా లేనప్పటికీ ఆ బస్టాండు స్థలాన్ని పూర్తిగా స్వాధీనంలోకి తీసుకునేందుకు చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణం పనులు ప్రారంభించారు. కొత్త బస్టాండ్ కు అతి సమీపంలో గల స్మశాన వాటికకు ఈ కాంపౌండ్ వాల్ నిర్మాణంతో దారి లేకుండా పోతుంది అనే దానిపై గ్రామ పెద్దలు ఆదివారం నాడు ఆందోళన దిగారు. వెంటనే గ్రామ కార్యదర్శిని పిలిపించారు బస్టాండుకు కాంపౌండ్ వాల్ నిర్మిస్తే స్మశాన వాటికకు వెళ్లడానికి దారి మూసి వేస్తున్నారని చూపించారు. వెంటనే సంబంధిత కాంట్రాక్టర్ ని పిలిపించి కాంపౌండ్ వాల్ నిర్మిస్తే దారి ఎలా అని ప్రశ్నించారు. ఆ కాంట్రాక్టర్ బస్టాండ్కు కాంపౌండ్ వాల్ నిర్మించే దానికి బస్టాండ్ లో నుండి శవాలు వెళ్లే విధంగా స్మశాన వాటిక వైపు పెద్ద గేటు నిర్మించడం జరుగుతుందని, స్మశాన వాటిక వరకు శవ రథం ఇతర వాహనాలు వెళ్లే విధంగా పెద్ద గేటు బిగిస్తున్నట్లు హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు.