బిక్కనూర్ కెనరా బ్యాంకు మేనేజర్ గా సైఫ్

నవతెలంగాణ-భిక్కనూర్
భిక్కనూర్ పట్టణ కెనరా బ్యాంకు మేనేజర్ గా సైప్ పదవీ బాధ్యతలు చెపట్టారు. అంతకు ముందు ఇక్కడ మేనేజర్ గా పనిచేసిన పవన్ కుమార్ హైదరాబాదుకు బదిలీ పై వెళ్ళగా ఆయన స్థానంలో బీహార్ కు చెందిన సైప్ ను ఇక్కడికి బదిలీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తానని, బ్యాంకు ద్వారా కావలసిన రుణాలు సకాలంలో అందించడం జరుగుతుందని తెలిపారు. ఖాతాదారులకు ఎలాంటి సమస్య ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు.