రెంజల్ మండలంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు..

నవతెలంగాణ – రెంజల్ 

రెంజల్ మండలంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశా లలలో ఘనంగా నిర్వహించారు. రెంజల్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ రజిని కిషోర్, తెలంగాణ తల్లి విగ్రహం వద్ద కాంగ్రెస్, బిఆర్ఎస్ నాయకులు, ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్నారు. మండలంలో ని 17 గ్రామపంచాయతీ పరిధిలో ఆయా గ్రామాలకు ప్రత్యేక అధికారులు జెండాలను ఎగురవేశారు. మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో సైతం ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపు కున్నారు. రెంజల్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణలో గ్రామ ప్రత్యేక అధికారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జెండాలను ఎగురవేశారు. మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మొబిన్ ఖాన్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, ప్రజా  ప్రతినిధులు, వైద్య అధికారులు, ఐకెపి సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.