
హైదరాబాదులో జరిగే ఆవిర్భావ దశాబ్దా వేడుకలలో అమరవీరుల వద్ద నివాళులర్పించడం కోసం సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు నియోజకవర్గ మలిదశ ఉద్యమకారుడు తీగల మల్లారెడ్డి ఆదివారం నియోజకవర్గ కేంద్రం నుండి బస్సుకి జెండా ఊపి బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2001 నుండి తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించామని ప్రతి ధర్నా రాస్తారోకో లో కూడా నలుమూలల తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకొని అలుపెరుగని పోరాటం చేసి తెలంగాణఅమరవీరుల కూడా జోహార్లు అర్పించి ఆనాడు నుండి నేటి వరకు కూడా ఉద్యమాలు చేసిన సందర్భంగా ఈరోజు హైదరాబాదులోని తెలంగాణ అవతరణ దినోత్సవం 11 సంవత్సరంలో అడుగుపెడుతున్న శుభసందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న అవతరణ దినోత్సవాలకు బయలుదేరుతున్నమన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలో అన్ని మండలాల ఉద్యమకారులు తదితరులు పాల్గొన్నారు .