నవీన్‌ కుమార్‌ రెడ్డిని కలిసిన బాలనగర్‌ బీఆర్‌ఎస్‌ నాయకులు

నవతెలంగాణ- బాలానగర్‌
మహబూబ్‌నగర్‌ జిల్లా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి నవీన్‌ కుమార్‌ రెడ్డి 111 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఆదివారం బాలానగర్‌ మండల బీఆర్‌ఎస్‌ నాయ కులు శుభాకాంక్షలు తెలిపారు. మహబూబ్‌ నగర్‌ ఎమ్మెల్సీ కోట స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో బీఆర్‌ ఎస్‌ అభ్యర్థి ఎం నవీన్‌ రెడ్డి విజయం సాధించిన సందర్బంగా వారిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన బాలానగర్‌ మండల పార్టీ అధ్యక్షులు పి శ్రీనివాస్‌ రావు,అప్పాజీపల్లి మాజీ సర్పంచ్‌ బాలు నాయక్‌, తిరుపతి నాయక్‌, వాయుకుంట మాజీ సర్పంచ్‌ మంజు నాయక్‌, గోపి నాయక్‌ పాల్గొన్నారు.