
నవతెలంగాణ – తొగుట
రాజకీయాల్లో గెలుపోటములు సాధారణమని, ఓటమిని భవిష్యత్ గెలుపుకోసం అవకాశంగా తీసుకుంటామని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్య క్షులు జీడిపల్లి రాంరెడ్డి పేర్కొన్నారు. మెదక్ పార్ల మెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంక ట్రామరెడ్డి ఓటమి చెందడం బాధాకరమన్నారు. బీఆర్ఎస్ పార్టీ చరిత్రలో గెలిచినప్పుడు వీర్ర విగ లేదు ఓటమి జరిగినప్పుడు కృంగిపోలేదన్నారు. మరోసారి బీఆర్ఎస్ పార్టీకి మెజారిటీ అందించిన మండల ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్ లో బీఆర్ఎస్ పార్టీ పుంజుకోవడం ఖాయమన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం సాగిస్తామన్నారు. ఎన్నికల్లో కృషి చేసిన పార్టీ శ్రేణులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.