సెమీస్‌లో స్వైటెక్‌

సెమీస్‌లో స్వైటెక్‌– ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ 2024
పారిస్‌ : ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌కు టాప్‌ సీడ్‌ ఇగా స్వైటెక్‌ (పొలాండ్‌) మరింత చేరువైంది. మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ఫైనల్లో ఐదో సీడ్‌ ఒండ్రుసోవ (చెక్‌ రిపబ్లిక్‌)పై స్వైటెక్‌ 6-0, 6-2తో ఏకపక్ష విజయం సాధించింది. ఐదు బ్రేక్‌ పాయింట్లు సాధించిన స్వైటెక్‌ చెమటోడ్చకుండానే సెమీఫైనల్లో అడుగుపెట్టింది. మరో క్వార్టర్‌ఫైనల్‌ మ్యాచ్‌లో కొకొ గాఫ్‌ (అమెరికా) అదరగొట్టింది. 6-4, 2-6, 6-3తో ఓన్స్‌ జబర్‌ (ట్యూనీషియా)పై మూడు సెట్ల మ్యాచ్‌లో విజయం సాధించింది. గురువారం జరిగే సెమీఫైనల్లో స్వైటెక్‌తో గాఫ్‌ అమీతుమీ తేల్చుకోనుంది. పురుషుల సింగిల్స్‌లో అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ 4-6, 6-1, 5-7, 7-6(7-2), 6-2తో హోల్డర్‌ రునెపై విజయంతో క్వార్టర్‌ఫైనల్లోకి చేరుకున్నాడు.