అక్కడలా.. ఇక్కడిలా…

– ఉత్తర తెలంగాణలో బీజేపీ..
– దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్‌ హవా
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
లోక్‌సభ ఎన్నికల ఫలితాలు రాష్ట్రంలో ఒక చిత్రమైన రాజకీయ వాతావరణానికి తెరతీశాయి. ఈ ఎన్నికల్లో ఉత్తర తెలంగాణలో ఒక రకమైన ఫలితాలొస్తే, దక్షిణ తెలంగాణలో మరో రకమైన రిజల్ట్స్‌ వచ్చాయి. ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, మెదక్‌, చేవెళ్లతోపాటు సికింద్రాబాద్‌, మల్కాజ్‌గిరిలో బీజేపీ అభ్యర్థులు గెలుపొందగా, అదే ఉత్తర తెలంగాణగా పరిగణించే పెద్దపల్లి నియోజకవర్గంలో మాత్రం కాంగ్రెస్‌ అభ్యర్థి గడ్డం వంశీ జయకేతనం ఎగరేశారు. ఇక దక్షిణ తెలంగాణలో చూస్తే మహబూబాబాద్‌, వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ, భువనగిరి, నాగర్‌కర్నూల్‌తోపాటు జహీరాబాద్‌లో కాంగ్రెస్‌ గెలిస్తే, మహబూబ్‌నగర్‌లో మాత్రం బీజేపీ అభ్యర్థి డీకే అరుణ గెలుపొందటం గమనార్హం.