
వేములవాడ రూరల్ మండలం ఎదురుగట్ల గ్రామంలో బుధవారం జరిగిన బీరప్ప-కామరాతి కల్యాణం, నాగవల్లి కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కురుమ కుల బాంధవుడు ఎగుర్ల శ్రీనివాస్ పిలుపు మేరకు చందుర్తి జడ్పిటిసి నాగం కుమార్, వేములవాడ రూరల్ మండల వైస్ ఎంపీపీ జక్కుల కవిత తిరుపతిలతో పాటు మరికొంత మంది ప్రముఖులు బీరప్ప కల్యాణ వేడుకల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో వారి వెంట జోగాపూర్ ఎంపిటిసి మ్యాకల గణేష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఏనుగుల శ్రీనివాస్, నాయకులు గుంటి కనకయ్య, గుంటి అంజి, ముద్దాల పరుశరాములు తదితరులు ఉన్నారు.