గ్రామాల్లో ప్రపంచ పర్యావరణ దినోత్సవ వారోత్సవాలు నిర్వహించాలి

– ఎంపీడీవో వెంకయ్య
నవతెలంగాణ-శంకర్‌పల్లి
మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రపంచ పర్యావరణ దినోత్సవ వారోత్సవాలు నిర్వహించాలని శంకర్‌పల్లి ఎంపీ డీవో వెంకయ్య అన్నారు. బుధవారం శంకర్‌పల్లి మండల ప్రజా పరిషత్‌ కార్యాలయంలో గ్రామ కార్యదర్శులతో, ఉపాధి హామీ సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వ హించారు. అంతకుముందు ప్రపంచ పర్యవరణాన్ని దినో త్సవం పురస్కరించుకుని జన్వాడ గ్రామంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలి అన్నారు. అదేవిధంగా ప్రజ లకు ఇంకుడు గుంతలపై కంపోస్టు పిట్స్‌, నాడేఫ్‌ కంపోస్ట్‌ తయారు చేసే నిర్మాణానికి ప్రతిపాదనలు తీసుకుని, సేంద్రియ ఎరువులు తయారు చేయాలన్నారు. గ్రామాల్లో పిచ్చి మొక్కలు తొలగించి ప్రభుత్వ స్థలంలో మొక్కలు నాటాలన్నారు. అదేవిధంగా గ్రామాల్లో మురుగు కాలువల్లో మురుగు నీరు నిలవకుండా ఎప్పటికప్పుడూ చెత్తను తొలగించాలని సూచించారు. పల్లె ప్రకృతి వనంతో పాటు నాటిన మొక్కలు ఎండిపోతే, వాటి స్థానంలో మరల మొక్కలు నాటాలని తెలిపారు. శిథిలావస్థలో ఉన్న ఇండ్లు, భవనాల దగ్గర పేరుకుపోయిన చెత్త చెదారం ఎప్పటికప్పుడూ తొలగించాలన్నారు. పాడుబడిన బావులను పూడ్చివేయాలన్నారు. ప్రతీ శుక్రవారం డ్రై డే పాటించా లన్నారు. మరుగుదొడ్ల ఉపయోగమంపై వివరించారు. అంతేకాకుండా ప్లాస్టిక్‌ వినియోగంపై పూర్తిగా నిషేధిం చేందుకు కృషి చేయాలన్నారు. కచ్చితంగా తడి, పొడి చెత్త వేర్వేరు చేసి, చెత్త సేకరించే ట్రాక్టర్‌లోనే వేయాలని తెలిపారు. కిచెన్‌ గార్డెన్‌ ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ గీత, గ్రామ కార్యదర్శిలు, ఉపాధి హామీ సిబ్బంది తదితరులు ఉన్నారు.