పరిశుభ్రతను పర్యావరణాన్ని కాపాడాలి

– మణికొండలో పరిశుభ్రతపై పర్యటన
– కమిషనర్‌ ప్రదీప్‌ కుమార్‌కు అవార్డు అందజేత
– పొల్యూషన్‌ ప్రిన్సిపాల్‌ సెక్రెటరీ ఐఏఎస్‌ వాణి ప్రసాద్‌
నవతెలంగాణ-గండిపేట్‌
పరిశుభ్రతను పర్యావరణాన్ని ప్రతి ఒక్కరూ కాపాడాలని రాష్ట్ర పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ ప్రిన్సిపాల్‌ సెక్రటరీ వాణి ప్రసాద్‌ ఐఏఎస్‌ అన్నారు. బుధవారం గండిపేట్‌ మండలం మణికొండ మున్సిపాలిటీలో పర్యావరణం పరిశుభ్రతలో భాగంగా పర్యటించారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ కమిషనర్‌ ప్రదీప్‌ కుమార్‌తో కలిసి ప్రధాన రహదారిలో పరిశుభ్రతతో పాటు మొక్కలను నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పొల్యూషన్‌ లేకుండా ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను పాటించాలన్నారు. పచ్చదనాన్ని ప్రకృతి వనంగా చేసుకొని ఆరోగ్యమైన జీవితాన్ని కొనసాగించాలన్నారు. మున్సిపాలిటీ ద్వారా చెత్త సేకరణ చేసిన తడి, పొడి చెత్తను కంపోస్టు తయారుచేసి ఎరువులకు ఉపయోగించడం సంతోషం అన్నారు. కిచెన్‌ వేస్ట్‌ కంపోస్ట్‌ చేయడంతో కమిషనర్‌కు అవార్డును అందజేశారు. మణికొండలోని హుడా కాలనీ రోడ్డుకిరువైపులా చెట్లను నాటి పరిశుభ్రతను చేయించారు. కార్యక్రమంలో మణికొండ మున్సిపల్‌ కమిషనర్‌ ప్రదీప్‌ కుమార్‌, డిఈ దివ్య జ్యోతి, ఏఈ సాయి మౌనిక, శానిటేషన్‌ జవాన్లు, మున్సిపల్‌ సిబ్బంది అధికారులు తదితరులు పాల్గొన్నారు.