ముంబయి : ఆన్‌లైన్ ట్రావెల్, హోటల్ బుకింగ్ వేదిక ఇక్సిగో ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) తేదీని ప్రకటించింది. ఇక్సీగో మాతృసంస్థ లీ ట్రావెన్యూ టెక్నాలజీ సీఈఓ, సీఎండీ అలోక్ బాజ్‌పేరు, సీఎఫ్‌ఓ సౌరభ్ దేవేంద్ర మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఇష్యూ ద్వారా రూ.740 కోట్లు సమీకరించనున్నట్టు తెలిపింది. ఐపీఓ జూన్ 10న ప్రారంభమై.. 12న ముగియనుందన్నారు. షేర్ల ధరల శ్రేణీని రూ.88-93గా నిర్ణయించామన్నారు. తాజా ఐపిఒలో రూ.120 కోట్లు విలువ చేసే కొత్త షేర్లను విక్రయించడంతో పాటుగా మరో 6.66 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ కింద అందుబాటులో ఉంచుతోన్నామన్నారు. సమీకరించిన నిధుల నుంచి రూ.45 కోట్లు నిర్వహణ మూలధన అవసరాల కోసం కేటాయించనున్నామన్నారు. ఇష్యూలో రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం ఒక్క లాట్‌లో 161 షేర్లను కొనుగోలు చేయాల్సి ఉంటుందన్నారు.