
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందని నాలేశ్వర్ మాజీ సర్పంచ్ సరిన్ అన్నారు. నాలేశ్వర్ గ్రామంలో బడిబాట కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా తల్లిదండ్రులతో పాటు ఉపాధి హామీ కూలీలతో గురువారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. నాలేశ్వర్ ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో విద్యతో పాటు సాంకేతిక విద్య, ఉచిత యూనిఫామ్, పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం పథకంతో పాటు అనేక సంక్షేమ, క్రీడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాబట్టి తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలని కోరారు. ఈ కార్యక్రమాలలో విడిసి సభ్యులు,ప్రధానోపాధ్యాయులు శ్రీధర్, రాజేందర్, ఉపాధ్యాయులు సాగర్, శ్రీనివాస్, గంగాధర్, సంజీవ్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.