
మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమం నిర్వహించారు. సర్కారు బడులను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేర్పడుతొంది. ఇందులో భాగంగానే ఏటా మాదిరిగానే ఈసారి కూడా పాఠశాలలు పున. ప్రారంభానికి ముందుగా బడిబాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.ఈనెల6నుంచి11వరకు కార్యక్రమాన్నీ నిర్వహించేలా షెడ్యూల్ విడుదల చేసింది. చిన్నారులను ఆయా గ్రామాల్లోని పాఠశాలల్లో 1వ తరగతిలో, 5వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులను 6వ తరగతిలో చేర్పించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అంగన్ వాడిల్లో ఉన్న పిల్లలను ప్రాథమిక పాఠశాలల్లో చేర్పించేలా కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు చంద్రకాంత్,కిషన్, బస్వరాజ్,పంచాయతీ సెక్రటరీ శ్రీనివాస్,అంగన్వాడి టీచర్లు పాల్గొన్నారు.