నవతెలంగాణ – పెద్దకొడప్ గల్
మండలంలోని అంజనీ గ్రామానికి చెందిన రబ్డా హరిదాస్ సముద్రాబాయ్ నాలుగో సంతానమైన రామ్ సింగ్ కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన అగ్నిపత్ లో భాగంగా హైదరాబాద్ లో శిక్షణ పొంది స్వగ్రాహానికి విచ్చేస్తున్న సందర్భంగా గ్రామ యువకులు ఘనంగా స్వాగతం పలికి సన్మానం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్నిపత్ లో ఎంపిక కావడం దేశానికి సేవ చేయాలనే ఒక దృఢమైన సంకల్పంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చానని ఈ నాలుగు సంవత్సరాలయిన దేశానికి సేవ చేసే అదృష్టం ఇంకా భావిస్తున్నాను నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు రుణపడి ఉంటానని దేశానికి సేవ చేస్తానని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామస్తులు యువకులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.