నవీన్‌ కుమార్‌ రెడ్డికి అభినందనలు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలుపొందిన నవీన్‌ కుమార్‌ రెడ్డిని పలువురు బీఆర్‌ఎస్‌ నేతలు అభినందించారు. గురువారం ఆయన హైదరాబాద్‌ లోని తెలంగాణ భవన్‌కు వచ్చిన సందర్భంగా మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, సీనియర్‌ నేత రావుల చంద్రశేఖర్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌ రెడ్డి, కార్పొరేషన్‌ మాజీ చైర్మెన్లు దేవీప్రసాదరావు, డాక్టర్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌, అల్లిపురం వెంకటేశ్వర్‌ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్సీగా తన గెలుపుకు సహకరించిన పార్టీ అధిష్టానానికి, నాయకులకు నవీన్‌ కుమార్‌ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.