నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
నీట్ ఫలితాల్లో ఆకాశ్ విద్యాసంస్థకు చెందిన 15 మంది విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించారు. ఈ మేరకు ఆకాశ్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ చీఫ్ అకడమిక్ బిజినెస్ హెడ్ ధీరజ్‌కుమార్ మిశ్రా గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. అనురన్ ఘోష్ 716 పర్సెంటైల్ స్కోర్‌తో 77వ ర్యాంకును సాధించారని తెలిపారు. ప్రణవ్ లకినపల్లి 711 స్కోర్‌తో 306 ర్యాంకు, రిజ్వాన్ షేక్ 710 స్కోర్‌తో 549 ర్యాంకు, జయంత్ 706 స్కోర్‌తో 755 ర్యాంకు పొందారని వివరించారు.