నవతెలంగాణ – కమ్మర్ పల్లి
మండలంలోని నాగపూర్ ప్రాథమికోన్నత పాఠశాలకు సెర్ప్ ఆధ్వర్యంలో కుట్టించిన ఏకరూప దుస్తులను శుక్రవారం అందజేశారు. ఈ మేరకు పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులకు అందించాల్సిన ఏకరూప దుస్తులను సెర్ప్ సిబ్బంది అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యుల సమక్షంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాసం శ్రీనివాస్ కు అందజేశారు.ఈ సందర్భంగా సెర్ఫ్ సీసీ నవీన్ కుమార్ మాట్లాడుతూ మండలంలోని ఆయా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందించాల్సిన ఏకరూప దుస్తులను సెర్ఫ్ ఆధ్వర్యంలో సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి మండలంలోని అన్ని పాఠశాలలకు ఏకరూప దుస్తులను సరఫరా చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి సంధ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ గౌడ్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ ఉమ, మాజీ సర్పంచ్ పాలెం నరసయ్య, గ్రామ అభివృద్ధి కమిటీఅధ్యక్షులు రాథోడ్ సాగర్, గ్రామ అభివృద్ధి కమిటీ కోశాధికారి పాలెం రాజేశ్వర్, మాజీ ఉప సర్పంచ్ అశోక్, అంగన్వాడి టీచర్లు, ఆశా వర్కర్లు, తదితరులు పాల్గొన్నారు.