నవతెలంగాణ – రెంజల్
మండల కేంద్రమైన రెంజల్ సింగిల్ విండో కు వచ్చిన స్టాక్ ను రైతుల సౌకర్యార్థం తాడు బిలోలి, సాటాపూర్, గిడ్డంగులలో భద్రపరచిన స్టాక్ ను తిరిగి రెంజల్ గిడ్డంగికి తరలిస్తుండగా మండల వ్యవసాయ అధికారి లక్ష్మీకాంత్ రెడ్డి అడ్డుకున్నారు. నిత్యవసర వస్తువుల చట్టం కింద 6a కింద ఈసీ ఏసీటీ 1955 ఫర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్ ఎఫ్ టి ఓ 1985 ప్రకారం కేసు నమోదు చేసి జిల్లా కలెక్టర్కు నివేదికను అందజేసిన తర్వాత, సొసైటీ సిబ్బంది తిరిగి తాడు బిలోలి, సాటాపుర్, గిడ్డంగుల నుంచి పట్టి స్టాకును డీసీఎం ద్వారా తిరిగి రెంజల్ గోడౌన్ కు తరలించడం చటరీత్యా కేసు నడుస్తున్న సమయంలో వాటిని తరలించడం నేరమని, స్థానిక రెంజల్ ఎస్సై ఈ .సాయన్న కు ఫిర్యాదు చేయగా, పోలీసులు సంఘటన స్థలానికి విచ్చేసి వాటిని స్వాదినం చేసుకుకున్నారు.