క్రీడాలతో మానసిక ఉల్లాసం..

– యుద్ధ ప్రాతిపదికన మినిస్టేడియం పనులు..
– ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్..
నవతెలంగాణ – వేములవాడ 
క్రీడాలతో మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వం ఉంటుందని ప్రభుత్వ విప్ ,వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు.. శుక్రవారం వేములవాడ పట్టణంలో ప్రెస్ క్లబ్ సౌజన్యంతో సాయి క్రికెట్ టీం వారి ఆధ్వర్యంలో సిరిసిల్ల జిల్లా స్థాయి మెగా  క్రికెట్ పోటీలను ప్రభుత్వ విప్  ప్రారంభించారు.. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. జిల్లాస్థాయి క్రికెట్ పోటీలకు  ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలిపారు.గ్రామాల్లో గతంలో కబడ్డీ కోకో వాలీబాల్  వంటి క్రీడలను ఆడే వాళ్ళమన్నారు.నేడు ఆధునిక ప్రపంచంలో క్రికెట్ విశ్వవ్యాప్తంగా అందరూ ఆదరిస్తున్నారని అన్నారు.  క్రీడలు అడటడం వలన సమస్యలను అధిగమించే ఒక శక్తి ఏర్పడుతుంది,క్రీడాకారుల మధ్య  ఒక స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుందన్నారు.యువత గ్రామాల్లో క్రికెట తో పాటు ఇతర క్రీడల్లో రాణించాలని అన్నారు. మన ప్రాంతంలోని క్రీడాకారులకు ఉపయోగపడేల అసంపూర్తిగా ఉన్న మిని స్టేడియాన్ని యుద్ధ ప్రతిపాదికన త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.గత కాంగ్రెస్ పార్టీ హయంలో నిధులు మంజూరు అయ్యాయన్నారు.మినీ స్టేడియంలో క్రీడాకారులకు అవసరమైన క్రీడ సామాగ్రిని అందుబాటులోకి తెస్తాం అన్నారు.
వేములవాడ పట్టణ యువకులకు క్రికెట్ ఆడటానికి మైదానం కావాలంటే మర్రిపెళ్లి ప్రాంతంలో మైదానానికి స్థల పరిశీలన జరుగుతుందన్నారు.ప్రభుత్వం అన్ని గ్రామాల్లో ఓపన్ జిమ్ లను ఏర్పాటు చేస్తుందన్నారు.దేశ భవిష్యత్తు నేటి యువత చేతిలో ఉందని, చెడు వ్యసనాలకు అలవాటు పడి భవిష్యత్ నాశనం చేసుకోవద్దన్నారు. రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్,గంజాయి రహిత రాష్ట్రంగా మారుస్తోందన్నారు. క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే హెచ్ 143ప్రెస్ క్లబ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సయ్యద్ లాయక్ పాషా, వేములవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మహమ్మద్ రఫీ, మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ పట్టణ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, ప్రధాన కార్యదర్శి కనికరపు రాకేష్, పుల్కం రాజు పులి రాంబాబు, పీర్ మహమ్మద్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.