
మండలంలోని పడకల్ తండాలో దిరాజ్ (5) అనే బాబు పై కుక్కల దాడి చేయగా, తలకు తీవ్ర గాయాలయ్యాయి. పడకల్ తండా కు చెందిన వీరేందర్ కుమారుడు ఇంటి బయట ఆడుకుంటుండగా కుక్కల దాడి చేశాయి. దారి వెంబడి పడకలు వెళ్లేవారు కుక్కలను వెళ్లగొట్టగా.. తీవ్ర గాయాలైన బాబుని నిజాంబాద్ ప్రభుత్వ హాస్పిటల్ తరలించారు. ప్రసుత్తం బాలుడికి వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు తెలిసింది.