తాజా లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ బలం పెరిగిందంటూ ఆపార్టీ నేతలు ఖుషీ అవుతున్నరు. అయితే ఎటొచ్చి అది బలుపు కాదు వాపు అని అంటున్నరాయే రాజకీయ విశ్లేషకులు. సొంత ఓట్లతో గెలిస్తే అది బలుపు అంటరు తప్ప, బీఆర్‌ఎస్ ఓట్లేపించుకుని సీట్లు కొడితే ఎట్ల అంటరు అంటూ జర్రంత ఆశ్చర్యపోతున్నరు. ఇక్కడ రెట్టింపు సీట్లతో ఆనందంలో ఉన్న కమలదళానికి, నార్త్‌లో దిమ్మతిరిగి కండ్లుబైర్లు కమ్మినాయే. మోడీ ఆశలు పెట్టుకున్న యోగీ రాష్ట్రంలో స్థానిక ఓటర్లు తోక కట్‌చేశారాయే. అంతేగాదుల్లో..అయోధ్య రామయ్య ఉన్న ఫైజాబాద్‌లో బీజేపీ ఓడిపాయే. కేంద్రంలో మోడీకి మెజారిటీ రాకపాయే. చంద్రబాబు, నితీష్‌కు సలామ్ కొట్టాల్సిన పనొచ్చే. ఇక ఒళ్లు దగ్గరపెట్టుకోవాల్సిన తరుణం ముందుకొచ్చిం దంటూ ఆపార్టీ నేతల్లో గుసగుస ఇనిపియ్యబట్టే. అయినా నాకెందుకులే గీ తంటా. ఉంట మరీ.
– బి.బసవపున్నయ్య