– పిడుగు పాటుకు శుక్రవారం మృత్యువాత చెందిన 5 గేదెలు
– తెలంగాణ ఉద్యమ వేదిక
– రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రామన్న
నవతెలంగాణ-దోమ
చౌడాపూర్ మండల పరిధిలోని లింగన్నపల్లి గ్రా మంలో శుక్రవారం పిడుగుపాటు కారణంగా ఆలకుంట లాలు అనే రైతు 5 గేదెలు మృతి చెందాయి. విషయం తెలుసుకున్న తెలంగాణ ఉద్యమ వేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రసిడెంట్ రామన్న పరామర్శించారు. ఘటనా స్థలానికి చేరుకుని రైతు లాలును అడిగి వివరాలు తెలుసుకున్నా రు. అనంతరం ఆయన స్థానిక ఎమ్మెల్యే టి.రామ్మోహన్ రెడ్డి, స్థానిక తహసీల్దార్, పశువైద్యాధికారిలతో ఫోన్లో మాట్లాడి పరిస్థితి వివరించారు. పశువైద్యాధికారి సిబ్బం ది వచ్చి మృతిచెందిన గేదెలు పరిశీలించిన అనంతరం జేసిబీ సహాయంతో వాటిని మట్టిలో పాతిపెట్టి పూడ్చేశా రు. అనంతరం ఆయన మాట్లాడుతూ..రైతు లాలు జీవనోపాధిగా పెంచుకుంటున్న 5 గేదెలు పిడుగు పాటు కారణంగా అకాల మరణం చెందడం బాధారకమన్నారు. రైతు లాలు కుంటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.10 ల క్షల నష్టపరిహారం చెల్లించి రైతును ఆదుకోవాలని డి మాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.