ప్రభుత్వ పాఠశాలల్లోనే..క్రమశిక్షణతో కూడిన విద్య

– ప్రధానోపాధ్యాయుడు ఏవీఆర్‌ శాస్త్రి
– నందివనపర్తిలో ప్రొఫెసర్‌ జయశంకర్‌ బడిబాట
– తమ పిల్లలను ప్రభుత్వ బడికి పంపాలని పిలుపు
– ప్రయివేటు బడులను నమ్ముకొని ఆర్థికంగా నష్టపోవద్దు
– ప్రయివేటు బడి వద్దు..ప్రభుత్వ బడే ముద్దు..అంటూ ప్రచారం
నవతెలంగాణ-రంగారెడ్డి డెస్క్‌
విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్యను ప్రభుత్వ పాఠశాలలే అందిస్తుందని ప్రధానోపాధ్యాయుడు ఏవీఆర్‌ శాస్త్రి అన్నారు. శనివారం యాచారం మండల పరిధిలోని నందివనపర్తిలో ప్రొఫెసర్‌ జయశంకర్‌ బడిబాటను నిర్వహించారు. అనంతరం సింగారం బొలిగుట్ట తండా, ఏనెకిందితండల్లో ఉపాధ్యాయ బృందం పర్యటించి ప్రభు త్వ పాఠశాలల్లో ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న సౌక ర్యాలను విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రయవేటు బడులు వద్దు..ప్రభుత్వ బడులే మీ పిల్లల చుక్కాని భవిష్యత్తు ముద్దని తెలిపారు. ప్రయివేటు పాఠశాలలను నమ్ముకుని మీరు ఆర్థికంగా నష్టపోవద్దని సూచించారు. ప్రభుత్వం ఉచితంగా విద్యార్థులకు యూనిఫామ్స్‌, పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం వంటి సౌకర్యాలు అందిస్తుందని ఆ యన పేర్కొన్నారు. ఈ సదవకాశాన్ని విద్యార్థుల తల్లిదం డ్రులు సద్వినియోగం చేసుకొని విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని ఆయన తెలియజేశారు. పదవ తరగతి ఫలితాల్లో 94శాతం ఉత్తీర్ణత సాధించిన ట్లు వివరించారు. ఎంతో అనుభవం ఉన్న ఉపాధ్యాయు లు విద్యను బోధిస్తారని తెలిపారు. కార్యక్రమంలో ఉపా ధ్యాయులు పద్మశ్రీ, పద్మలత, వెంకట్‌ రెడ్డి, కిషన్‌ మురళీ ధర్‌, పరమేశ, భోజయ్య, అజరు రాథోడ్‌ అరుణ, విజయ రాణి, పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.