– ప్రజ్ఞానందకు మూడో స్థానం
స్టావెంజర్ (నార్వే) : మాగస్ కార్ల్‌సన్ నార్వే చెస్ 2024 చాంపియన్‌గా నిలిచాడు. మెన్స్ విభాగంలో 19 పాయింట్లు సాధించిన లోకల్ స్టార్ తిరుగులేని విజయం సాధించాడు. ఫైనల్ రౌండ్లో ఫాబియానో (అమెరికా)పై కార్ల్‌సన్ గెలుపొందాడు. రెండో స్థానంలో నిలిచిన హికారు నకముర (అమెరికా)ను ఆర్. ప్రజ్ఞానంద ఓడించాడు. 15.5 పాయింట్లతో నకముర రెండో స్థానంలో నిలువగా..14.5 పాయింట్లతో చెన్నై చిన్నోడు మూడో స్థానం సాధించాడు. అలిరెజా నాల్గో స్థానంలో నిలిచాడు. మహిళల విభాగంలో జు వెంజున్ (చైనా) 19 పాయింట్లతో విజేతగా నిలిచింది. వైశాలి, కోనేరు హంపి వరుసగా 4, 5 స్థానాలు సాధించారు.