నవతెలంగాణ-ఖమ్మం
రామోజీరావు మృతి పట్ల రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శనివారం హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీ లోనే రామోజీరావు పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ మీడియా రంగంలో విలువలతో కూడిన నూతన ఒరవడికి, ఎన్నో సంస్కరణలకు ఆద్యుడు రామోజీరావు అని గుర్తుచేసుకున్నారు. ఆయన మృతి మీడియా రంగానికి, తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు అని అన్నారు. ఆయన మతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
రామోజీ రావు మృతి పట్ల మాజీ మంత్రి పువ్వాడ సంతాపం
ఈనాడు గ్రూపు సంస్థల చైర్మెన్ రామోజీ రావు మరణం పట్ల మాజీ మంత్రి పువ్వాడ అజరు కుమార్ సంతాపం తెలిపారు. శనివారం హైదరాబాద్ లో రామోజీ ఫిలిం సిటీ లోనే రామోజీరావు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు వాడి సత్తాను యావత్ ప్రపంచానికి చాటి చెప్పిన రామోజీరావు చిరస్మరణీయులన్నారు. పత్రిక, టీవీ, సినిమా తదితర రంగాల్లో రామోజీరావు సాధించిన విజయాలు ఆయనకు మాత్రమే కాకుండా యావత్ తెలుగు జాతికి గర్వకారణమన్నారు.
పెనుబల్లిలో రామోజీరావుకు ఘన నివాళులు
పెనుబల్లి : ఈనాడు దినపత్రిక అధినేత రామోజీరావుకు మండల రాజకీయ నాయకులు, ప్రముఖులు శనివారం నివాళులర్పించారు. వీఎం బంజర్ రింగు సెంటర్లో గాంధీ విగ్రహం ముందు రామోజీ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో చీకటి రామారావు మోరంపూడి బాబురావు, నాగాంజనేయులు, ఎస్‌కే బాబు, విశ్రాంతి ఉపాధ్యాయులు గోపిశెట్టి వెంకటేశ్వరరావు, తవు నాయక్, వంగ గిరిజాపతి మందడపు అశోక్ కుమార్, ఆచంటి శ్రీనివాసరావు, బుర్ర కోటేశ్వరరావు, వంగా దామోదర్ రావు, వేముల నరసింహారావు, కారుమంచి ఆనంద్, చీకటి నరసింహారావు ఉన్నారు.
రామోజీరావు మృతికి సండ్ర సంతాపం
కల్లూరు : ఈనాడు సంస్థల వ్యవస్థాపకులు, అక్షర యోధుడు, రామోజీ ఫిల్మ్ సిటీ అధినేత చెరుకూరి రామోజీరావు అకాల మరణానికి చింతిస్తూ… సత్తుపల్లి మాజీ శాసన సభ్యులు సండ్ర వెంకట వీరయ్య తీవ్ర సంతాపం, కుటుంబ సభ్యులకు, అభిమానులకు సానుభూతి తెలియజేశారు. వారి మృతి సినీ ప్రపంచానికి తీరని లోటని అన్నారు.
బీఆర్‌ఎస్ మండల పార్టీ తీవ్ర సంతాపం
సంతాపం తెలిపిన వారిలో ఎంపీపీ బీరవల్లి రఘు, జెడ్పీటీసీ కట్టా అజరు కుమార్, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షులు పాలెపు రామారావు, సీనియర్ నాయకులు డా. లక్కినేని రఘు, డీసీసీబీ డైరెక్టర్ బోబొలు లక్ష్మణరావు, కాటమనేని వెంకటేశ్వరరావు, బొప్పన రామారావు, దేవరపల్లి భాస్కరరావు, మేకల కృష్ణ పాల్గొన్నారు.