యువత ఆశలకు అనుగుణంగా నోటిఫికేషన్లు

– ఎమ్మెల్యే మాలోత్‌ రాందాస్‌నాయక్‌
నవతెలంగాణ-కారేపల్లి
రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వంపై యువత పెట్టుకున్న ఆశలకు అనుగుణంగా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వనుందని వైరా ఎమ్మెల్యే మాలోత్‌ రాందాస్‌ నాయక్‌ అన్నారు. శనివారం కారేపల్లిలోని కాంగ్రెస్‌ నాయకులు ఎండీ.యాకూబ్‌ అలీ ఇంట్లో విలేకరులతో మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ నిరంకుశ పాలన, ఆపార్టీ నాయకుల ఆగడాలపై తీన్మార్‌ మల్లన్న నిలదీసి,ప్రశ్నించారన్నారు. మల్లన్న విజయం ప్రభుత్వంపై మరింత బాధ్యత పెంచిందన్నారు. కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలతో పాటు మిత్రపక్షాలైన సీపీఐ, సీపీఐ(ఎం), టీజేఎస్‌, టీడీపీ శ్రేణులు క్షేత్రస్ధాయిలో పని చేసిన ఫలితంగా సునాయస విజయం సాధ్యమైందన్నారు.
మృతుల కుటుంబాలకు ఎమ్మెల్యే పరామర్శ
కారేపల్లి, తులిశ్యాతండాలలో ఇటివల మృతి చెందిన జవ్వాజి కౌసల్య, పాల్తియా ద్వాళి సంస్మరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మృతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఈకార్యక్రమంలో పీసీసీ మహిళ ఉపాధ్యక్షురాలు పగడాల మంజుల, కాంగ్రెస్‌ మండల అధ్యక్షులు తలారి చంద్రప్రకాశ్‌, ఎస్సీ సెల్‌ అధ్యక్షులు మేదరి వీరప్రతాఫ్‌, వాణిజ్య విభాగం జిల్లా ఉపాధ్యక్షులు సురేందర్‌మనియార్‌, జిల్లా నాయకులు ఇమ్మడి తిరుపతిరావు, బానోత్‌ రాంమ్మూర్తి, సంత ఆలయ చైర్మన్‌ అడ్డగోడ ఐలయ్య, న్యాయవాది నర్సింగ్‌ శ్రీనివాసరావు, మండల కోఆప్షన్‌ ఎండీ.హనీఫ్‌, నాయకులు దారావత్‌ భద్రునాయక్‌, గుగులోత్‌ భీముడు, గుగులోత్‌ శ్రీను, వాంకుడోతో గోపాల్‌, మల్లెల నాగేశ్వరరావు, దారావత్‌ వినోద్‌, సపావట్‌ నాగులు, పొలగాని శ్రీనివాస్‌, గడ్డం వెంకటేశ్వర్లు, వాంకుడోత్‌ నరేష్‌, గుగులోత్‌ మంగ్యా, గుగులోత్‌ హర్షనాయక్‌, షేక్‌ సైదులు తదితరులు పాల్గొన్నారు.