ఎక్కడ గోదావరి.. ఎక్కడ దుబ్బాక..

నవతెలంగాణ-దుబ్బాక
“దుబ్బాక ప్రాంతం కరువు కాటకాలతో తల్లడిల్లిపోయేది.బోరు బావుల్లో నీళ్లు లేక పంటలు పండక వర్షం కోసం ఆకాశానికి ముఖంపెట్టి ఎదురు చూసేవాళ్లం”అని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కోమటిరెడ్డి వెంకట నరసింహారెడ్డి అన్నారు.బుధవారం దుబ్బాక పురపాలిక కేంద్రంలోని బాలాజీ గార్డెన్స్ లో ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సాగునీటి దినోత్సవం కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి,బీ ఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కోమటిరెడ్డి వెంకట నరసింహారెడ్డి హాజరై మాట్లాడారు.ఈ ప్రాంత రైతుల గోసను తీర్చాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ ఎక్కడో ఉన్న గోదావరి నది నీళ్లతో నేడు దుబ్బాక ప్రాంతంలోని మడిమడికి,ఇంటింటికి సాగు,తాగునీరును అందిస్తున్నాడని చెప్పుకొచ్చారు.600 మీటర్ల ఎత్తు నుంచి నీటిని తెచ్చి మల్లన్న సాగర్ ప్రాజెక్టు కాలువల ద్వారా నియోజకవర్గంలోని ప్రతి చెరువును నింపుతున్నాడన్నారు.కాలేశ్వరం ప్రాజెక్టు గొప్పదనం గురించి వార్తాపత్రికల్లో పతాక శీర్షికలు వచ్చాయని గుర్తు చేశారు.సీఎం కేసీఆర్ పంట పెట్టుబడి సాయం అందించి రైతులకు అండగా నిలిచారన్నారు.అనంతరం మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా వెంకట నరసింహారెడ్డి సొంత ఖర్చులతో కోనుగోలు చేసిన “తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాలతో కూడిన గోడ గడియారాలను”ఆవిష్కరించారు. బిఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు గుండవెళ్లి ఎల్లారెడ్డి,మహమ్మద్ సలీం,కరికె శ్రీనివాస్ పలువురున్నారు.ఎస్ఇ బస్వరాజ్ ,ఈఈ వేణు బాబు, రవీందర్ రెడ్డి,సాయి బాబా, డీఈలు హరికిషన్, శ్రీనివాస్, శిరీష్ , శ్రీనివాస్, సీతారామరాజు, ఏఈలు విష్ణు వర్ధన్ రెడ్డి, జునైద్ అలీ, అమర్, మాల్లోజు, పలువురున్నారు.