కాళేశ్వరంతో గ్రామాల్లో జల కళ

నవతెలంగాణ – చిన్నకోడూరు
నెర్రెలు బారిన చెరువులకు కాళేశ్వరం నీళ్ళతో నింపడంతో గ్రామాల్లో జల కళ సంతరించుకుందని చిన్నకోడూరు ఎంపిపి కూర మాణిక్యరెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా గ్రామ, గ్రామాన చెరువుల పండగ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని మిషన్ కాకతీయ పథకంతో చెరువులు బాగు చేసినట్లు తెలిపారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం ఆవరణంలో చెరువుల పండుగ కార్యక్రమంపై అధికారులతో సమావేశం నిర్వహించారు. సాగునీటి వేడుకలు ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం ఎన్నో పథకాలు తీసుకొచ్చినట్టు తెలియజేశారు. సాగునీటితో ఒక్క గుంట ఎండకుంట యాసంగి మొత్తం వరి పంట పండినట్లు తెలిపారు. రైతు సంక్షేమానికి ప్రభుత్వం ఎన్నో పథకాలు తీసుకొచ్చినట్టు తెలిపారు. రైతుల కళ్ళల్లో ఆనందం చూడడమే ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వనిత రవీందర్ రెడ్డి, గంగాపురం సొసైటీ చైర్మన్ కనకరాజు, అల్లిపురం సొసైటీ చైర్మన్ సదానందం, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు ఉమేష్ చంద్ర, ఎంపీటీసీల పోరం మండల అధ్యక్షులు శ్రీనివాస్, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.