ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ పోర్టుపోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) భారీగా ఈక్విటీలను తరలించుకుపోయారు. గడిచిన ఒక్కవారంలోనే రూ.14,794 కోట్ల విలువ చేసే ఈక్విటీలను విక్రయించారు. 2024లో ఇప్పటివరకు రూ.38,158 కోట్ల షేర్లను కొనుగోళ్లు చేశారు. గడిచిన ఏప్రిల్, మే, జూన్‌లో ఇప్పటి వరకు రూ.34,257 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారు. దేశీయ ఇన్వెస్టర్లు పెట్టుబడులకు మొగ్గు చూపుతున్న తరుణంలోనూ విదేశీ ఇన్వెస్టర్లకు భారత మార్కెట్లపై విశ్వాసం సన్నగిల్లడం గమనార్హం. ప్రస్తుత ఏడాదిలో ఇప్పటి వరకు రూ.23,363 కోట్ల ఎఫ్‌పీఐలు తరలిపోయాయని జియోజిట్ ఫైనాన్సీయల్ సర్వీసెస్ స్ట్రాటజీ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ వీకే విజరు కుమార్ తెలిపారు. చైనాలోని స్టాక్స్ చౌకగా ఉండటంతో చైనా ఎక్సేంజీలోని సూచీలపై విదేశీ ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారని అన్నారు.