”ఎంత కోయిల పాట వధయయ్యెనో కదా చిక్కు చీకటి వనసీమలందు” అని జాషువ ఆవేదన చెందాడు. ”పుట్టరానిహొచోట పుట్టుకతన ఎన్ని వెన్నెల వాగులు ఇంకిపోయనో గదా?”హొఅని వాపోయాడు.హొనేటికీ ఎంతోమంది అణగారిన వర్గాల కవులు, కవయిత్రులుహొవెలుగులోకి రాకుండా పోయారు. సాహిత్య చరిత్రలో వారికిహొసముచిత స్థానం దొరకలేదు. దళిత సాహిత్య ఉద్యమ ఉధతిలో కొంతమంది తొలితరం కవులు వెలుగులోకి వచ్చారు. డాక్టర్ కల్లూరి ఆనంద రావు,హొగోగుశ్యామల, డాక్టర్ సంగిశెట్టి శ్రీనివాస్ లాంటి పరిశోధకులుహొపాత తరం కవులను, కవయిత్రులను సాహిత్య లోకానికి పరిచయం చేశారు. దళిత సాహిత్య చరిత్ర ఊట చెలిమ లాంటిది. ఈ సజన చెలిమ నుండిహొ మధురమైన కవితాజలాన్ని ఇంకా వెలికి తీయాల్సిన అవసరముంది. తరతరాలుగా అక్షరానికి దూరం చేయబడిన జాతిలో వెల్లువెత్తిన,హొ సాహిత్య జీవ నదులతో వర్తమాన కాలానికి అంటిన కాలుష్యాన్ని సమూలంగా ప్రక్షాళన చేయాలి. ఇలాంటి మరొక కవితా జీవనది కొల్లి వెంకన్న. వెంకన్న మాష్టారుగా ప్రఖ్యాతిగాంచినహొఈ కవి తూర్పు గోదావరి జిల్లా కోలంక గ్రామంలో 1932 ఫిబ్రవరి 4వ తేదీ మహాలక్ష్మి (తండ్రి పేరు) గంగమ్మ దంపతులకు జన్మించాడు. తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు కావడంతోహొవెంకన్న ఐదవ తరగతి వరకు చదివి, ఆర్థిక ఇబ్బందుల వలన విధిలేని పరిస్థితుల్లో పశులకాపరిగా భూస్వామి వద్ద చేరాడు. ఆ తరువాత మేనమామ వడ్డిహొవెంకన్న, గురువు వీరన్నలహొ ప్రోత్సాహంతోహొవిద్యనభ్యసించి ఉపాధ్యాయవత్తిలో ప్రవేశించాడు. పల్లి పాలెం, కోలంక గ్రామాలలో ఉపాధ్యాయుడిగా సేవలందించాడు.హొ విద్యార్థులకు కొంగుబంగారంగా, గ్రామ ప్రజలకు తలలో నాలుకగా విలసిల్లి, వారి కష్టసుఖాల్లో పాలుపంచుకున్నాడు. రచయిత దాట్ల దేవదానంరాజు వెంకన్న ప్రియ శిష్యుడు. ఆయన ఏలుబడిలో అక్షరాలు దిద్దుకొని, తరువాతహొ గురువుతో కలిసి ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. కోనసీమ ప్రాంత ప్రజల గుండెల్లో ఉత్తమ ఉపాధ్యాయుడిగా కొలువైన కొల్లివెంకన్న 1996హొజూన్ 11న మరణించాడు.
డెబ్బయ్యో దశకంలో ఆధునికదష్టితో దళితహొస్పహతోహొవెంకన్న హొఎన్నో పద్యాలు, గేయాలు, శతకాలు రాశాడు.హొనిరుపేదలు, వ్యసాయకూలీలు, అణగారిన వర్గాలు నిత్య జీవితంలో అనుభవిస్తున్న కష్టనష్టాలను వాస్తవ దష్టితో కవిత్వీకరించాడు.హొస్పందనాస్పద హదయంతో కవిత్వం రాసుకుంటూ పోవటం తప్ప ప్రచురణ విషయం వెంకన్న పట్టించుకోలేదు. అమూల్యమైన వెంకన్న అముద్రిత రచనలను సేకరించి వారి కుమారుడు కొల్లి సత్యనారాయణ ‘దళిత వేదన’ పేరుతో కవితా సంపుటిని ప్రచురించాడు. పద్య, గద్య, శతక, వచన, గేయ రూపంలో వెలువడిన ఈ సంపుటిని ఇటీవల హైదరాబాద్లో ఆవిష్కరించారు. తరువాత యానాంలో పరిచయ సభ నిర్వహించారు.హొ
ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయుడైన వెంకన్న ప్రత్యేకించి భాషా శాస్త్రాలను అధ్యయనం చేయకపోయినప్పటికీ కుసుమ ధర్మన్న, గుర్రం జాషువ, బోయి భీమన్నల ప్రభావంతో సామాజిక అసమానతలు, ఆర్థిక అంతరాలు, ప్రజాసమూహంలో వేళ్లూనుకున్న మూఢ నమ్మకాలను తీవ్రంగాహొ నిరసిస్తూహొ సరళంగా పద్య కవిత్వం రాశాడు.హొసందేశాత్మకమైన గేయాలు రాశాడు. ఒక్కొక్క అంశం గురించి భావ పరమైన పునరుక్తి లేకుండాహొఎనభైకి పైగా పద్యాలు రాశాడు. కొన్ని పద్యాలు శతకశైలిలో ప్రబోధాత్మకంగా సాగాయి. కులపిశాచుల కుటిలత్వాన్ని, మత గజంబుల మదాన్ని మట్టు బెట్టాలని, ‘మనువు చూపిన బాటను మంట గలపాలని వెంకన్న పిలుపునిచ్చాడు. దళితహొ జనుల వేదనను కవిత్వంలో శక్తివంతంగా పలికించాడు. మనువాదుల గుండెలదిరేలా ప్రశ్నాస్త్రాలను సంధించాడు. ”నీదు తల్లివలెనె నా తల్లి యున్నది/ నిన్ను గన్న యట్లు నన్ను గనెను/ నీదు రూపు గూడ నాదు రూపేనోయి/ ఏల వచ్చె నాకు మాల తనము?” అంటూ సమర్థుడైన న్యాయవాదిలాగా కులవ్యవస్థ రూపొందించిన కుట్రనుహొవ్యతిరేకించాడు. ‘ఇరువురందు భేద మిసుమంతయు లేదని’హొపద్యాల ద్వారా శాస్త్రీయంగా నిరూపించాడు.హొ”కోట్లకొలది సొమ్ము/ కూడ బెట్టు నరుడు కూడా” కూలి వానిహొఅండదండ లేకపోతే ఒక్క క్షణం కూడా మనుగడ సాగించలేడని వెంకన్న తెగేసి చెప్పాడు. కిందికులంలో పుట్టిన కారణంగాహొకూలివాడిగా మారాల్సి వచ్చిందనే ప్రగాఢమైన విశ్లేషణతో కవిత్వం రాశాడు.హొకుల నిర్మూలనా పోరాటంలో ముందుకు నడిచిన ఈలి వాడవల్లి, బి. వి రమణయ్య, పావన మూర్తి, పొనుగుమట్ల విష్ణుమూర్తి తదితర దళిత వైతాళికుల, నాయకుల అచంచల కషినిహొపద్యాలలో కొనియాడాడు.హొహొ
కవికి అపూర్వ వస్తు నిర్మాణ దక్షత ఉండాలి. విస్తత వస్తువులను వేయి కళ్ళతో పరిశీలించి, పాఠక లోకానికి సరికొత్త రసస్ఫూర్తి కలిగించాలి. కొల్లి వెంకన్న అతి సాధారణ వస్తువులను గ్రహించి, పీడిత ప్రజల జీవితాలకు అన్వయించి రమణీయమైన పద్యాలను రచించాడు. డాక్టర్ బోయి విజయభారతి అన్నట్లుగా వెంకన్న ఊహాశక్తి గొప్పది. ఆయన ఎంచుకున్న కవితా వస్తువులలో వైవిధ్యం ఉంది. ‘ఉప్పు మాత’హొలాంటి కవితల్లో ఈ రకమైన దష్టి కనిపిస్తుంది.
”నీళ్ళు నీది తండ్రి, నేల నీదు జనని/ ఇరువురకును బుట్టి యిలను వెలసి/ సర్వ జనుల కిలను చప్పదనము బాపె/హొగొప్ప దానివమ్మ ఉప్పు మాత” అంటూ కవి ఉప్పుహొపుట్టుకహొతీరును కవిత్వంగా మలిచాడు. ”నిన్ను గన్న తండ్రి, నీరు మళ్ళీ నిన్ను హతమారుస్తుందని, కరుణ లేనట్టి వాడు నీదు కన్న తండ్రి” అంటూ నీటికి ఉప్పుకు ఉన్నహొవిలక్షణ బంధాన్నిహొతేటతెల్లం చేసి,హొఉప్పు మాతతోహొఆత్మీయంగా కవి సంభాషిస్తాడు.హొనిత్య జీవనంలో ఉప్పు ప్రయోజనాన్ని, ఆహారంలో ఉప్పు ప్రాధాన్యతను, కడలి తీరంలో ఉప్పు ఉత్పత్తివిధానాన్ని, ఉప్పు వలన కలిగే లాభ, నష్టాలనుహొ వెంకన్న సముచితంగా అక్షరబద్ధంచేశాడు. జనుల నాలుకల మీద ఉప్పు ‘రుచి మొలకలు’ మొలిపిస్తుందని, ఆహారవిజ్ఞానికి ఉప్పుగల్లు ‘ఒజ్జవిత్తు’గా ఉపయోగపడుతుందని కవితాత్మకంగా సంభాషించాడు. కోటేశ్వరునికీ, కటిక నిరుపేదకుహొఉప్పు ఒకేరకంగా మేలు సమకూర్చుతుందని, ఉప్పుకు ఉన్న సమబుద్ధి మనుషులకు లేదని ఆవేదన చెందుతాడు కవి. ఉప్పుకు కూడా పన్ను చెల్లించాలని హుకూం జారీ చేసిన సీమదొరల దోపిడీహొ విధానాన్ని వెంకన్న నిరసించాడు. ‘గొప్పదానివమ్మ ఉప్పు మాత’ అనే మకుటంతోహొఉప్పుతో సంభాషిస్తున్నట్లుగా సాగిన వెంకన్న పద్యశైలిహొ విశిష్టంగా ఉంటుంది. ‘తాటి చెట్టు జనని నీకు దండమమ్మ’ అనే మకుటంతోహొహద్యమైన భావధారతో వెంకన్న రాసిన పద్యాలు ఎంతగానో ఆకట్టు కుంటాయి. ”నీదు రక్తము కాశించి నీదు సుతులు/ తలలను నరికి నెత్తురు త్రాగు చుండె” అంటూహొకవి ఆవేదన చెందాడు. ఈ పద్యాలు చదువుతుంటే కరుణశ్రీ ‘పుష్ప విలాపం’ మదిలో మెదులుతుంది. ”దాన కర్ణుడు నీలోన దాగియుండె/ నిన్ను బోలిన సహకారి ఇలనెవరు గలరు?” అంటూ వెంకన్న బహుళ ప్రయోజన దాయిని తాటిచెట్టు ఔన్నత్యాన్ని పద్యాల్లో ప్రస్తుతించాడు. కష్టజీవుల కడుపులో చెలరేగే ఆకలి మంటలనార్పే తల్లియని కీర్తించాడు. మద్యపానం, చీట్లపేక వల్ల సంభవించే ప్రమాదాలనుహొకవిత్వంలో వెంకన్న ఆమోదయోగ్యంగా చిత్రించాడు. ఈ వ్యసనంహొ’సిరులను నోటన బెట్టియు కర కరమని నమిలి.. కడుపున దాస్తుందని” నరులను నాశన మొనర్చు పరమ పిశాచి’ యని కవి హెచ్చరించాడు. ”మేడల రేడుల యందున ఆడమని, పాడుబడిన బ్రతుకుల ఇళ్ళలో కాలు పెట్టవద్దనిహొ చీట్లపేకను వెంకన్న వేడుకున్నాడు. ‘కోడిరేడు’ కవితలో కోడికి మనిషికి మధ్యవున్న సంబంధ బాంధవ్యాలను, కాలికి కత్తి గట్టుకొని రణరంగంలో వీరోచితంగా పోరాడే కోడిపుంజు ధీరత్వాన్ని రమణీయంగా వర్ణించాడు .
అసమ సమాజంలో బుసలుకొడుతున్న కులవివక్ష, పేదరికం, మతాధిపత్యాలను ఎదుర్కొనే క్రమంలోహొవెంకన్న ప్రతిఘటనాత్మకమైనహొ చైతన్యాన్ని అందిపుచ్చుకున్నాడు. భావిభారత పౌరులను తీర్చిదిద్దే పాఠశాలలో కూడాహొ ఆయన అనేక అవమానాలను ఎదుర్కొని, ఆత్మగౌరంతో వాటిని ధిక్కరించి నిలబడ్డాడు.హొడాక్టర్ ఏ.టి కోవూరు, గోరా, తాపీధర్మారావు వంటి వారి ప్రేరణతోహొహేతువాదిగా పరిణామం చెందాడు. మనుషులను నిలువెల్లా కలుషితం చేస్తున్న మూఢాచారాలను తరిమికొట్టే శాస్త్రీయ ఆలోచనలను విద్యార్థుల్లోనూ, తనజాతి జనుల్లో రేకెత్తించాడు. యెండ్లూరి చిన్నయ్య అంబేడ్కర్ జీవిత చరిత్ర అధ్యయనస్ఫూర్తితోహొవెంకన్న సామాజిక విముక్తి తత్త్వాన్ని అర్థం చేసుకున్నాడు. బాబాసాహెబ్హొఅంబేడ్కర్ స్థాపించిన ‘రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా’ రాజకీయాలను, ఆశయాలనుప్రచారం చేశాడు. ఈశ్వరీ బాయి, బి.వి.రమణయ్య లాంటిహొ నాయకులు కూడా ఎన్నికల సమయంలో అంబేడ్కర్ భావజాల ప్రచారానికిహొవెంకన్నను ఆహ్వానించటంహొవిశేషంగా భావించవచ్చు.హొడాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ జీవన, ఉద్యమ తీరుతెన్నులను వెంకన్న తన పద్యాలలో తాత్త్విక బంధురంగా చిత్రించాడు. ”అంధకారము బాపు అరుణుడేమి గొప్ప?” అంటూ ”చీకటిహొ బాపె అంబేద్కరే గొప్ప” అంటూ వెంకన్న భీమైక దష్టితో కలమెత్తి చాటిచెప్పాడు. ”మతము మారినావుగానిహొ మాలతనము పోయిందా? మతము మారినా గాని మాదిగవే నీవిలలో” అంటూ క్రైస్తవ, హిందూమతాల పరిమితుల్లో చిక్కిన మాల మాదిగలను ప్రశ్నించాడు. చర్చి, దేవాలయాల్లో, ప్రార్ధనలు, అర్చనల్లోహొమునిగి తేలే అణగారిన వర్గాలకు వెంకన్నహొఅంబేడ్కర్ హక్కుల ఆవశ్యకతను తెలియజెప్పాడు.. ”కలమను హలమున భారత పొలము దున్ని/ జాతి మెరక పల్లము లెల్ల/ సౌఖ్య జలములు సర్వము సాగు నటుల/ సల్ఫితివి భీమ! నీకిలసాటి ఎవరు?” అంటూహొఅంబేడ్కర్ బహుముఖీన ఔన్నత్యాన్నిహొ అపురూపంగా వర్ణించాడు. ”సత్యభామ మగనిచక్రంబు కంటెను/హొభూపుత్రి పతియొక్క తూపుల కన్నను/ శివుని కరమునందు శూలంబు కంటెను/ అపరబుద్ధుని కల మరయ ఘనము” (ఘనుడు అంబేడ్కరుండు). విష్ణు చక్రం, రామ బాణం, శివుని శూలం ఇత్యాది పురాణ వీరుల ఆయుధాల కంటే అంబేడ్కర్ కలము ఘనమైనదని కొల్లి వెంకన్న జ్ఞానోత్తేజంతో నిర్ధారించాడు. ఏభయ్యేళ్ల క్రితం వెంకన్న రాసిన ఈ పద్యంలో ఈనాటి దళిత కవుల తాత్విక ఎరుక కనిపిస్తుంది. ”మీ దగ్గర బ్రహ్మాస్త్రం ఉంది/ ఉంటే ఉండనివ్వండి/ మీ దగ్గర పాశు పతాస్త్రం ఉంది/ ఉంటే ఉండనివ్వండి” అని సూర్యవంశి రాసిన ‘యెన్నుంటేనేం’ కవితకు వెంకన్న పద్యానికి భావ సామీప్యత కనిపిస్తుంది.
వెంకన్న ఉపాధ్యాయుడు కావటం వల్ల విద్యార్థుల మనోవికాసాన్ని పెంపొందింపజేసే సంకల్పంతో ‘కోతి దూలము’, ‘కాకి పూజ’ లాంటిహొ సుప్రసిద్ధ కథలను, వాటిలోని నైతిక విలువలను, జీవిత సత్యాలనుహొ పద్యాలుగా మార్చి, పఠన యోగ్యమైన శైలిలో ప్రబోధించాడు. కథా కావ్య రచనాశైలిలో సాగిన ఈ ఖండికలు పాఠ్యపుస్తకాలలో చేర్చదగిన స్థాయిలోఉన్నాయని డాక్టర్ పల్లేరు వీరాస్వామి అన్నమాట సత్య సమ్మతమైనది.హొచాలామంది పండితుల్లాగా వెంకన్న ఏ గురువు వద్దా పంచకావ్యాలను, వ్యాకరణ, ఛందోగ్రంథాలను పఠించలేదు.హొ పద్యరూపంలో సందేశమందిస్తే అది పదికాలాలపాటు నిలుస్తుందని ఆయన భావించాడు. చాలామంది దళిత సంప్రదాయ కవుల్లాగా పద్య రచనను సాధన చేసి పూర్తిగా వ్యవహారశైలిలో పద్యాలు రాశాడు. అక్కడక్కడ అన్వయ దోషాలు, వ్యాకరణపరమైన చిన్న చిన్నపొరపాట్లు దొర్లినప్పటికీహొవెంకన్న పద్యాల్లో ఉదాత్తమైనహొభావసంపద పొంగిపొర్లుతుంది. మానవీయ జీవన మార్గం ఆలోచనా లోచనాలకు దర్శనమిస్తుంది. అన్నిటికీ మించి అంబేద్కర్, బౌద్ధ తాత్త్వికతకు వెంకన్న కవిత్వం నిలువుటద్దంలా ఉంటుంది.
(జూన్11 కొల్లి వెంకన్న వర్ధంతి సందర్భంగా)
డాక్టర్ కోయి కోటేశ్వర రావు, 9440480274