ఘనంగా ఎమ్మెల్యే కవ్వంపల్లి జన్మదిన వేడుకలు 

– మండల వ్యాప్తంగా నిర్వహించిన కాంగ్రెస్ శ్రేణులు
– శిభిరంలో పలువురి రక్తదానం
నవతెలంగాణ – బెజ్జంకి 
మానకొండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ జన్మదిన వేడుకలను మండల వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నిర్వహించారు.అదివారం మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద మండలాధ్యక్షుడు ముక్కీస రత్నాకర్ రెడ్డీ అధ్వర్యంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి జన్మదిన వేడుకలు ఏర్పాటుచేశారు.కాంగ్రెస్ శ్రేణులు కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణి చేశారు.బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్,ఉపాధ్యక్షుడు లింగాల శ్రీనివాస్,పోతిరెడ్డి రాజశేఖర్ రెడ్డి,మంకాల ప్రవీణ్,రొడ్డ మల్లేశం, చిలువేరు శ్రీనివాస్ రెడ్డి,ఒంటెల సంపత్ రెడ్డి,సంజీవ రెడ్డి,మాజీ సర్పంచ్ రావుల నర్సయ్య,జెల్లా ప్రభాకర్,బైరి సంతోష్ తదితరులు హజరయ్యారు.
జేరిపోతుల మధు అధ్వర్యంలో..
ఎమ్మెల్యే కవ్వంపల్లి జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ మండల నాయకుడు జేరిపోతుల మధు అధ్వర్యంలో మండల కేంద్రంలోని పలువురు విద్యార్థులకు పుస్తకాలు,పెన్నులు పంపిణీ చేశారు. కాంగ్రెస్ యువజన నాయకులు పాల్గొన్నారు.
పెరుకబండలో..
పెరుకబండ గ్రామశాఖ అధ్యక్షుడు కర్రావుల తిరుపతి అధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యలయం వద్ద కేక్ కట్ చేసి ఎమ్మెల్యే కవ్వంపల్లి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.నాయకులు చిలుముల ఎల్లయ్య,కొడముంజ శ్రావణ్ కుమార్,పోతుల అరుణ్ కుమార్,కార్యకర్తలు మైల రాకేశ్,నవీన్,కొంపల్లి శంకరయ్య,కర్రావుల రవి,బోషా సుదర్శన్,రాములు పోచ మల్లయ్య,నారాయణ,గాలిపల్లి శ్రీనివాస్, చిలుముల మోహన్,గ్రామపంచాయతీ పంచాయతీ సెక్రెటరీ రాజి రెడ్డి,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
వృద్దాశ్రమంలో బియ్యమందజేత..
ఎమ్మెల్యే కవ్వంపల్లి జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మాజీ మండలాధ్యక్షుడు చెప్యాల శ్రీనివాస్ అధ్వర్యంలో చిన్నకోడూర్ మండలం చెర్ల అంకిరెడ్డిపల్లి గ్రామ శివారులోని వృద్దాశ్రమంలో 25 కిలోల బియ్యమందజేశారు.పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
ప్రజా భవన్ లో రక్తదాన శిభిరం..
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీలోని ప్రజా భవన్ యందు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ జన్మదినం సందర్భంగా ప్రత్యేక రక్తదాన శిభిరం నిర్వహించారు.పలువురు మండల కాంగ్రెస్ శ్రేణులు శిభిరంలో పాల్గొని రక్తదానం చేశారు.రక్తదానం చేసిన కాంగ్రెస్ శ్రేణులను ఎమ్మెల్యే కవ్వంపల్లి సతీమణి అనురాధ అభినందించారు.